మెగాస్టార్-సూప‌ర్‌స్టార్ క‌ల‌యిక‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్

ఒక భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం `మెగాస్టార్ - సూప‌ర్ స్టార్` క‌లుస్తున్నారు.

Update: 2024-09-18 09:30 GMT

ఒక భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం `మెగాస్టార్ - సూప‌ర్ స్టార్` క‌లుస్తున్నారు. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో 11 ఏళ్ల విరామం త‌ర్వాత మ‌రో భారీ ప్ర‌య‌త్నం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. పాపుల‌ర్ మ‌ల‌యాళ హీరోలు మమ్ముట్టి - మోహన్‌లాల్ గురించే ఇదంతా. ఆ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు దాదాపు 11 సంవత్సరాల విరామం తర్వాత తెర‌పై క‌లిసి న‌టించ‌నున్నారు. దర్శకుడు మహేష్ నారాయణన్ ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక షెడ్యూల్ శ్రీలంకలో 30 రోజుల పాటు చిత్రీకరించాల్సి ఉంది. కేరళ, ఢిల్లీ, లండన్‌ సహా ప‌లు లొకేష‌న్ల‌లో ఈ సినిమాని తెర‌కెక్కిస్తారు.


తాజా మీడియా క‌థ‌నం ప్రకారం... మలయాళ చలనచిత్ర నిర్మాతల సంఘం (MFPA) అధ్యక్షుడు ఆంటో జోసెఫ్, నిర్మాత సివి సారథిల‌తో క‌లిసి దర్శకుడు సంతోష్ నారాయ‌ణ‌న్ నేరుగా శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధనను క‌ల‌సారు. లంక ప్ర‌ధానికి తమ ప్రణాళికలను వివరించారు. మ‌ల‌యాళ‌ మెగాస్టార్ మమ్ముట్టి - సూప‌ర్ స్టార్ మోహన్‌లాల్ తమ కెరీర్‌లో 50కి పైగా చిత్రాలలో కలిసి నటించారు. రంజిత్ తెర‌కెక్కించిన‌ 2013 చిత్రం `కాదల్ కాదన్నోరు మత్తుకుట్టి`లో వారు చివరిగా క‌లిసి న‌టించారు. టేక్ ఆఫ్ (2017), సి యు సూన్ (2020), మాలిక్ (2021), అరియిప్పు (2022) చిత్రాలతో ఎడిటర్‌గా మారిన మహేష్ నారాయ‌ణ‌న్‌కు ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగాను మంచి పేరుంది. పాపుల‌ర్ రచయిత MT వాసుదేవన్ నాయర్ చిన్న కథల ఆధారంగా రూపొందించిన‌ `మనోరతంగల్` అనే వెబ్ సిరీస్ లో `షెర్లాక్` అనే విభాగానికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మెగాస్టార్ మ‌మ్ముట్టి, సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కాంబినేష‌న్ సినిమాకి అత‌డు స‌న్నాహ‌కాలు చేయ‌డం ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది.

సూప‌ర్ స్టార్ మోహన్‌లాల్ తన దర్శకత్వ వెంచ‌ర్ `బరోజ్ 3డి` తో బిజీ కానున్నారు. పిల్లల ఫాంటసీ చిత్రమిది. ఇందులో లాల్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. అలాగే L2: ఎంపురాన్ , జీతు జోసెఫ్ తో రామ్ అనే చిత్రాల్లోను లాల్ న‌టిస్తున్నారు. మరోవైపు మమ్ముట్టి కూడా వ‌రుస చిత్రాల‌తో బిజీ. డెబ్యూ డెనిస్ `బజూకా` విడుదల కోసం మ‌మ్ముట్టి ఎదురుచూస్తున్నాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ లోను న‌టిస్తారు. ఇందులో అత‌డు ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రను పోషించ‌నున్నారు.

Tags:    

Similar News