మంగళవారం.. ఆ సినిమాకు కనెక్షన్?

సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం కట్టిపడేసే గ్రిప్పింగ్ కథనంతో మంగళవారం మూవీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది.

Update: 2023-11-19 14:05 GMT

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం మంగళవారం. ఈ మూవీ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం కట్టిపడేసే గ్రిప్పింగ్ కథనంతో మంగళవారం మూవీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది. దీంతో ఈ మూవీకి మెల్లగా ఆడియన్స్ పెరుగుతున్నారు. థియేటర్స్ కూడా ఫుల్ అవుతున్నాయి.

ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పుత్ కి అజయ్ భూపతి మరో సూపర్ హిట్ మంగళవారం సినిమాతో ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. పాయల్ నటన కూడా ఈ సినిమాలో హైలైట్ నిలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఇందులో దిల్ రాజు మంగళవారం సినిమాని సీనియర్ వంశీ అన్వేషణతో పోల్చడం విశేషం.

తెలుగులో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే అన్వేషణ గుర్తుకొస్తుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని అజయ్ భూపతి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారరని కొనియాడారు. అన్వేషణ సినిమాలో కూడా అడవిలో జరిగే హత్యలు ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని క్లైమాక్స్ వరకు ఎవ్వరూ గ్రహించలేరు. అందులో మంచివాళ్ళుగా కనిపించే శరత్ బాబు, రాళ్ళపల్లి హంతకులుగా గుర్తిస్తారు.

మంగళవారం సినిమాలో కూడా అదే తరహాలో ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఈ కథని అజయ్ భూపతి నడిపించాడు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది సస్పెన్స్ గా నడిపించాడు. ఘోస్ట్ గా మారిన పాయల్ వారిని చంపుతుందనే విధంగా కథని నడిపించాడు. అలాగే గ్రామంలో ఉన్నవారే హత్యలు చేస్తున్నారనే డౌట్ క్రియేట్ చేశాడు

ఫైనల్ గా ఎవ్వరూ ఊహించని విధంగా ట్విస్ట్ లతో కథని మలుపు తిప్పారు. ఎక్స్ పెక్ట్ చేయని వారిని హంతకుడుగా చూపించి ఆశ్చర్యపరిచాడు. చివరి 30 నిమిషాలు అయితే వరుసగా రివీల్ అవుతున్న ట్విస్ట్ లతో ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. దీంతో మంగళవారం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే తన ఫేవరేట్ డైరెక్టర్ వంశీ అన్వేషణ చాయలు మూవీలో ఉంటాయని చెప్పారు. అలాగే కొన్ని సన్నివేశాలు అజయ్ భూపతి డిజైన్ చేశారు కూడా కాని కథ, కథనం విషయంలో అజయ్ తన స్టైల్ లో సరికొత్తగా ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ తీసుకోవడం విశేషం.

Tags:    

Similar News