కమల్‌హాసన్‌తో మణిరత్నం ఎందుకింత ఆలస్యం?
దర్శకదిగ్గజం మణిరత్నం .. విలక్షణ నటుడు కమల్ హాసన్ 1987 చిత్రం నాయకన్ (నాయకుడు) కోసం కలిసి పని చేసారు.
దర్శకదిగ్గజం మణిరత్నం .. విలక్షణ నటుడు కమల్ హాసన్ 1987 చిత్రం నాయకన్ (నాయకుడు) కోసం కలిసి పని చేసారు. ఈ సినిమాతో వెండితెరపై అద్బుతమైన మ్యాజిక్ సృష్టించారు. ఈ చిత్రం ది గాడ్‌ఫాదర్ ఆధారంగా రూపొందించిన ఎపిక్ క్రైమ్ డ్రామా. వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేసేందుకు దాదాపు 37 సంవత్సరాలు పట్టింది. తదుపరి `థగ్ లైఫ్` అనే సినిమా చేస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు పట్టడానికి కారణమేమిటి? అని దర్శకుడు మణిరత్నంని మీడియా ప్రశ్నించగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు.
ఈ మూడు దశాబ్దాలుగా కమల్‌తో కలిసి పని చేయలేదని.. ఎందుకంటే ఆయన స్థాయికి సరిపోయే స్క్రిప్ట్ తన వద్ద లేదని మణిరత్నం పేర్కొన్నారు. గొప్ప సామర్థ్యం ఉన్న నటుడు, సినిమా కోసం అనేక పనులు చేయగలిగిన వ్యక్తి తో ఇది చాలా కష్టం. కాబట్టి మనం ఏదైనా ఇవ్వాలంటే అతడిలో కనీసం సగం అయినా ధృడత్వం ఉంటే తప్ప తనతో పని చేసేందుకు సాహసించలేం. మాకు ఇప్పటికి కుదిరింది. మేం ఇప్పుడు మా తదుపరి చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రను తెరపైకి తీసుకురాగలమని ఆశిస్తున్నాము`` అని అన్నారు.
స్టార్లకు నాతో ఈగోలు ఉండవు:
మణిరత్నం తన కెరీర్ మొత్తంలో కమల్, విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, నాగార్జున, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, మనీషా కొయిరాలా సహా అనేక మంది తారలతో కలిసి పనిచేశారు. ఇంత పెద్ద స్టార్స్‌ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపిస్తుంది? అని ప్రశ్నించగా..పెద్ద తారలు నాతో పని చేస్తున్నప్పుడు వారికి ఎటువంటి ఈగోలు ఉండవని నేను అనుకోను. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే, వారు మిమ్మల్ని నియంత్రించడానికి అనుమతించడం చాలా సంతోషం కలిగిస్తుంది. నేను కూడా ఒకరిని నియంత్రించడం కోసం నటీనటులతో పని చేయను. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మాత్రమే చేస్తాను`` అని అన్నారు.
`నాయకన్` విడుదలైన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మణి తన పుట్టినరోజున కమల్ హాసన్‌తో `థగ్ లైఫ్`ను ప్రకటించారు. ఆరంభం టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇది బంజరు, పొగమంచు భూమి మధ్యలో ఒంటరిగా నిలబడి ఉన్న కథానాయకుడిని చూపించింది. ఒక అంగీ కప్పుకుని అతడు ఐదుగురు వ్యక్తులకు దూరంగా నిలబడి, ఆయుధాలతో కనిపిస్తారు. గుబురు గడ్డం కోర మీసాలతో స్పెషల్ గా కనిపించాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో జయం రవి, త్రిష, దుల్కర్ సల్మాన్, అభిరామి, నాజర్ కూడా నటించనున్నారు.