యాక్టర్ శృంగార సన్నివేశానికి OTT బ్లాస్ట్

బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ కు సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-12-16 19:30 GMT

బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ కు సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేస్తున్నారు. అలా అన్నింటితో క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మంచి హిట్స్ అందుకుని తన సత్తా చూపిస్తున్నారు.

ఓటీటీల వల్ల తెలుగు సినీ ప్రియులకు కూడా బాగా చేరవయ్యారు మనోజ్ బాజ్ పాయ్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన చేసే ప్రాజెక్టులు డిఫరెంట్‌ గా ఉంటాయని ఫిక్స్ అయిపోయారు. అయితే రీసెంట్ గా క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిస్పాచ్ తో ప్రేక్షకుల ముందుకు మనోజ్ బాజ్ పాయ్ వచ్చిన విషయం తెలిసిందే.

కను బ్హెల్ తెరకెక్కించిన ఆ సినిమా.. నేరుగా జీ5 ఓటీటీలో రిలీజ్ అయింది. డిసెంబర్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దేశంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ పెద్ద స్కామ్ నేపథ్యంలో డిస్పాచ్ మూవీ తెరకెక్కినట్లు క్లియర్ గా తెలుస్తోంది. మనోజ్ బాజ్ పాయ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా సినిమాలో కనిపించి మెప్పించారు.

వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఓ స్కామ్ ను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ఉన్న హీరో బయటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే అంశంతో సినిమా తెరకెక్కింది. అయితే మూవీలోని కొన్ని సీన్స్ ఇప్పుడు నెట్టంట వైరల్ గా మారాయి.

షహానా గోస్వామి, రియ్ సేన్, అర్చితా అగర్వాల్‌ తో మనోజ్ బాజ్ పాయ్ కొన్ని బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేశారు. శృ*గార సన్నివేశాల్లో ఆయన ఓ రేంజ్ లో నటించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అనేక మంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అయితే ఆ వీడియో క్లిప్ వల్ల డిస్పాచ్ మూవీ కొద్ది రోజులుగా ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది. ఆ వైరల్ క్లిప్

కేవలం ఒక రోజులోనే జీ5కి లక్ష మందికి పైగా కొత్త సబ్స్క్రైబర్లను తీసుకొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అది అఫీషియల్ కాకపోయినప్పటికీ నిజమేనని తెలుస్తోంది. ఆ క్లిప్ తో సినిమా చూసేందుకు అనేక మంది ఇంట్రెస్ట్ చూపించారట. ఓవరాల్ గా మూవీకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. ఒక్క వైరల్ క్లిప్ తో మూవీ వైపు అందరి దృష్టి మళ్ళిందనే చెప్పాలి.

Tags:    

Similar News