పరిస్థితులు ప్రతి క్షణం సవాల్ చేస్తాయి: మ‌నోజ్ భాజ్‌పాయ్

వంద‌ల సంఖ్య‌లో ఆర్టిస్టులు సినీప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు.

Update: 2024-12-10 03:52 GMT

వంద‌ల సంఖ్య‌లో ఆర్టిస్టులు సినీప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. ఆర్టిస్టుగా ఏదో ఒక రోజు త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవాల‌ని ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. కానీ అవ‌కాశాలు వ‌రించేది, అదృష్టం క‌లిసొచ్చేది చాలా కొద్దిమందికి మాత్ర‌మే. చాలా ఏళ్ల పాటు శ్ర‌మించాక‌.. చివ‌రికి ఏదో ఒక‌రోజు త‌మ‌కు పెద్ద స్టార్ అయ్యే ఛాన్స్ వ‌స్తుంది.

రెండు సార్లు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా పుర‌స్కారాలు గెలుచుకున్న మ‌నోజ్ భాజ్ పాయ్ ఒక సాధార‌ణ రైతు కుటుంబంలో జ‌న్మించి.. మారుమూల గ్రామం నుంచి బాలీవుడ్ కి వ‌చ్చి పెద్ద స్టార్ అయ్యారు. తెలివైన‌వాడిని, మొండి పట్టుదలగలవాడిని గ‌నుక‌నే ఈ రంగంలో రాణించాన‌ని మ‌నోజ్ అన్నారు. స‌త్య సినిమాలో బికూ పాత్ర‌తోనే త‌న‌కు మంచి పేరొచ్చింద‌ని, ఆ త‌ర్వాత వ‌రుస‌గా అవ‌కాశాలొచ్చాయ‌ని మ‌నోజ్ భాజ్ పాయ్ అన్నారు. అయితే త‌న‌కు వెంట‌వెంట‌నే విల‌న్ వేషాలే ఇచ్చేవార‌ని అది న‌చ్చ‌క చాలా అవ‌కాశాలు వ‌దులుకున్నాన‌ని కూడా తెలిపారు.

సినీప‌రిశ్ర‌మ‌లో తెలివిగా మొండిగా సాహసోపేతంగా ముందుకు సాగాలి. నేను మొండిగా వెళ్లాను.. లేకపోతే పరిస్థితులు ప్రతి క్షణం మిమ్మల్ని సవాల్ చేస్తాయి.. మిమ్మల్ని మీరు అనుమానించేలా చేస్తాయి! అని బాజ్‌పేయి అన్నారు. ``నువ్వు దూకే ముందు నాలుగు అడుగులు వెనక్కి వేయు`` అని ఒక సామెత ఉంది. నేను నన్ను ఎక్కువగా ప్రేమించలేదు. పరిస్థితులను అర్థం చేసుకున్నాను. 1998 అండర్‌వరల్డ్ డ్రామా `సత్య`లో న‌టించిన త‌ర్వాతే మంచి కెరీర్ అందుకోగలిగాను.. అని తెలిపారు.

విల‌న్ అవ‌కాశాల‌కు ఒప్పుకుంటూ పోతే ఇక అందులోంచి తాను బ‌య‌ట‌ప‌డ‌న‌ని భావించి మొండిగా తిర‌స్క‌రించాన‌ని కూడా మ‌నోజ్ భాజ్ పాయ్ తెలిపారు. విలన్ బ్రాకెట్ నుండి బయటికి రావడం దాదాపు అసాధ్యమని భావించాక పాత్రల ప‌రంగా ప్ర‌యోగాలు చేసాన‌ని భాజ్ పాయ్ తెలిపారు.

ఆరుగురు తోబుట్టువులలో ఒకరిగా పుట్టిన త‌న‌కు సినీప‌రిశ్ర‌మ‌లో ఎద‌గాల‌నే ఆశ‌యాల‌కు మ‌ద్ధ‌తు స‌రిపోలేద‌ని తెలిపారు. రైతు అయిన త‌న‌ తండ్రి వ‌ద్ద‌ తన ఆశయాలకు మద్దతునిచ్చే వనరులు లేవని చెప్పాడు. బాజ్‌పేయి కేవలం 17 సంవత్సరాల వయస్సులో ఢిల్లీకి వెళ్లి కళాశాలలో చదివాడు. తన తల్లి కోరుకున్నట్లు విద్యను అభ్యసించారు. ఆ త‌ర్వాత న‌ట‌న‌లో ప్ర‌వేశించి పెద్ద స్టార్ అయ్యారు. ఇటీవ‌ల‌ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో అత‌డికి గొప్ప పేరొచ్చింది.

Tags:    

Similar News