ఎవరు ఈ మేధా శంకర్‌... ఆసక్తికర విషయాలు మీకోసం

ఈ మధ్య కాలంలో ఎవరి నోట చూసినా కూడా 12th ఫెయిల్‌ మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

Update: 2024-01-20 00:30 GMT
ఎవరు ఈ మేధా శంకర్‌... ఆసక్తికర విషయాలు మీకోసం
  • whatsapp icon

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే సక్సెస్ లు తప్పనిసరి. అయితే పెద్దగా ఆఫర్లు రాని సమయంలో ఓపికతో ప్రయత్నాలు చేసిన సమయంలో మాత్రమే ఏదో ఒక సమయంలో అవకాశాలు వస్తాయి. ఆఫర్లు రావడం లేదని వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ లను కమిట్ అవ్వకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కెరీర్‌ లో మంచి జరుగుతుందని మేధా శంకర్‌ కెరీర్ ను చూస్తే అర్థం అవుతుంది.


ఈ మధ్య కాలంలో ఎవరి నోట చూసినా కూడా 12th ఫెయిల్‌ మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. జీవితంలో ఫెయిల్‌ అయిన వ్యక్తి మళ్లీ ఎలా తనలోని ఆత్మ విశ్వాసం ను నింపుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాడు అనేది సినిమా కథాంశం. సినిమాలోని అన్ని పాత్రలు భలే సెట్ అయ్యాయి అంటూ రివ్యూలు వస్తున్నాయి.


12th ఫెయిల్‌ సినిమాలో హీరోయిన్ గా మేధా శంకర్ నటించింది. ఆ సినిమా విడుదలకు ముందు మేధా ఇన్‌ స్టా గ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య 16 వేలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ సంఖ్య రెండు మిలియన్ లకు చేరింది. అంతే స్పీడ్‌ గా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. త్వరలో ఐదు మిలియన్ లకు చేరిన ఆశ్చర్యం లేదు.


ఈ ఫాలోవర్స్ సంఖ్య ను బట్టి 12th ఫెయిల్‌ సినిమా ఆమెకు ఎంతటి గుర్తింపు తెచ్చి పెట్టిందో చెప్పుకోవచ్చు. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదట షార్ట్‌ ఫిల్మ్‌ లో నటించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట నిరాశ ఎదురైనా కూడా ఓపికతో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసింది.

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టాలు పడ్డట్లుగా చెప్పుకొచ్చిన మేధా శంకర్‌ ఇప్పుడు బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ అనడంలో సందేహం లేదు. రాబోయే సంవత్సర కాలంలో ఆమె నుంచి భారీ ఎత్తున సినిమాలు వస్తాయని విశ్లేషకులు నమ్ముతున్నారు.

Tags:    

Similar News