మీడియం రేంజ్ హీరోలు.. అందరూ ఒకేసారి..

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా సినిమాలకు రిలీజ్ డేట్ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకు చాలా కారణాలే ఉన్నాయి.

Update: 2023-12-04 07:12 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా సినిమాలకు రిలీజ్ డేట్ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రభాస్ 'సలార్' మూవీ అనుకోకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో డిసెంబర్ నెలలో రావలసిన చాలా సినిమాలు వెనకడుగు వేశాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి.

సంక్రాంతి సీజన్ అయిపోయాక 2024 మార్చిలో మీడియం రేంజ్ హీరోలు తలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మీడియం రేంజ్ హీరోల్లో మార్చ్ రిలీజ్ ని మొదటగా కన్ఫర్మ్ చేసుకుంది ఉస్తాద్ హీరో రామ్ పోతినేని. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్"₹' 2024 మార్చ్ 8 రిలీజ్ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇక డిసెంబర్ లో ఎలాగైనా తన సినిమాని విడుదల చేయాలని పట్టుదలగా కూర్చున్నాడు విశ్వక్ సేన్. కానీ అది జరగలేదు.

సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేయడం ఇష్టం లేకున్నా చేసేదేం లేక రామ్ తో తలపడేందుకు 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమాతో బరిలోకి దిగుతున్నాడు. ఇక ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' కూడా మార్చి కి షిఫ్ట్ అయింది. మొదట సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ షూటింగ్లో జాప్యం జరగడంతో సినిమాని మార్చిలోనే తీసుకొస్తామని తాజాగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.

కచ్చితంగా రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ మార్చి మూడో వారంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక కొత్త రిలీజ్ అయిన అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఇక ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సైతం అదే మార్చిలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు కానీ నిర్మాత అనిల్ సుంకర త్వరలోనే దీనిపై డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళతోపాటు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి కొన్ని చిన్న చిత్రాలు కూడా మార్చి రేస్ లో ఉన్నాయి

మార్చ్ అయిపోతే తిరిగి ఏప్రిల్ లో ఎన్టీఆర్ 'దేవర' తో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి క్యూ కడతాయి. కాబట్టి వీలైనంతవరకు రిస్క్ లేకుండా మీడియం రేంజ్ హీరోలు మార్చి లోపు థియేటర్స్ లో తమ సినిమాని రిలీజ్ చేసేయాలి. లేదంటే ఓవైపు థియేటర్ల సమస్యలతో పాటు కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశాలుంటాయి. అందుకే మార్చ్ మీదే మీడియం రేంజ్ హీరోలు దృష్టి పెడుతున్నారు. వీళ్ళు మాత్రమే కాదు ముందు ముందు మార్చిలో రాబోయే సినిమాల లిస్ట్ పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News