మీనాక్షి.. పక్కా అధిష్ఠానం మనిషి..అందుకే తెలంగాణకు

దేశంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్నది మూడే రాష్ట్రాల్లో.. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ.

Update: 2025-02-15 10:30 GMT

దేశంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్నది మూడే రాష్ట్రాల్లో.. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఇందులో తెలంగాణ ఆ పార్టీకి చాలా కీలకం.. ఎంతో కష్టపడి.. ఎన్నో సవాళ్లను దాటి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కూడా పదేళ్లు అధికారానికి దూరమై.. ఆపై పార్టీ పరంగా ఎంతో నష్టపోయిన సమయంలో 2023లో తిరిగి అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ కు ఉన్నంత క్షేత్రస్థాయి బలం బీఆర్ఎస్ కూ లేదు. అయినా, కాంగ్రెస్ అంటేనే గ్రూపులు.. కలిసికట్టుగా ఉండడమే పెద్ద సమస్య. ప్రస్తుతం అధికారంలో ఉన్నా ఇదే సమస్యగా మారింది. ఇటీవల కొన్ని పరిణామాలు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందిపెట్టేవిగా మారాయి. దీంతో అధిష్ఠానం నేరుగా రంగంలోకి దిగింది.

విద్యార్థి దశ నుంచే..

రత్లామ్ లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐలో చేరడంత ద్వారా మీనాక్షి రాజకీయ జీవితం మొదలైంది. 1999-2002 మధ్య ఆమె ఎన్ఎస్ యూఐ అధ్యక్షురాలిగా, 2002-05 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో ఏఐసీసీ కార్యదర్శి అయ్యారు.

ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ అధ్యక్షురాలిగా ఉన్న మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ లో కీలక సభ్యురాలు.

తెలంగాణలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిని మార్చేసింది. మణిక్యం ఠాగూర్ స్థానంలో దీపాదాస్ మున్షీని నియమించింది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్. కాగా, మీనాక్షి మాజీ ఎంపీ. 2009లో మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు.

2014, 2019 సాధారణ ఎన్నికల్లో మీనాక్షి పరాజయం పాలయ్యారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏఐసీసీ పరిశీలకురాలిగా వ్యవహరించారు.

కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇంచార్జ్ గా వచ్చారు మీనాక్షి. ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కఠిన సవాల్ ను ఎదుర్కోనున్నారు.

మధ్యప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన ఉజ్జయినికి దగ్గర్లోని బిర్లాగ్రామ్ నగ్డాలో పుట్టిన మీనాక్షి బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. దేవీ అహల్య యూనివర్సిటీ మాజీ విద్యార్థిని.

Tags:    

Similar News