మెగా ప్రిన్స్ తో మహేశ్ భామ.. సెట్టయినట్టే
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్లో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్లో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆరడుగుల మెగా హీరో.. 'గాండీవధారి అర్జున' అనే భారీ యాక్షన్ ఫిల్మ్ చేశారు. ఆగస్టు 25న మూవీ రిలీజ్ రెడీగా ఉంది. దీని తర్వాత ఆయన.. వైవిధ్య చిత్రాల దర్శకుడు 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' ఫేమ్ కరుణ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయింది. 'హిట్' మూవీ సక్సెస్ తో జోష్ మీదున్న మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు మేకర్స్. రీసెంట్ గా మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంలోనూ సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. తొలిసారి సూపర్‌స్టార్ చిత్రంలో నటించే అవకాశం అందుకున్న ఈ యంగ్ బ్యూటీ.. అంతలోనే మెగా హీరో సరసన నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. ఈ మధ్యే చర్చలు జరిగాయట. కథ నచ్చి మీనాక్షి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఇకపోతే ఈ చిత్రం దర్శకుడు కరుణ కుమార్ గురించి తెలిసిందే. తొలి చిత్రంతోనే ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. పలాస చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకులు ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు కథానాయకుడిగా 'శ్రీదేవి సోడా సెంటర్'ను తీశారు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు మూడో చిత్రంగా వరుణ్ తేజ్‌తో కలిసి ఓ భిన్నమైన కథతో సినిమా చేయనున్నారు.
ఈ చిత్రం.. 1960ల బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని అంటున్నారు. బాగా పరిశోధించి దర్శకుడు కథను సిద్ధం చేశారని తెలిసింది. ఇప్పటి వరకు కెరీర్లో చేయనటువంటి పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నారని చిత్ర వర్గాల సమాచారం. మాసివ్ రోల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర కోసం వరుణ్ తన మేకోవర్నుకూడా మార్చుకోనున్నారట.
సినిమాను భారీ బడ్జెట్‌తో వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజేందర్ రెడ్డి తీగల, మోహన్ చేకూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. వరుణ్ కెరీర్ లో ఇదే భారీ చిత్రం కానుంది. ఇప్పటికే ఈ బ్యానర్లో నాని 30 'హాయ్ నాన్న' తెరకెక్కుతోంది. సినిమాను జులై 27న ప్రారంభించనున్నారని ప్రచారం సాగుతోంది. జీవీ ప్రకాష్ కుమార్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలని మూవీటీమ్ భావిస్తోందట. ఆయనతో చర్చలు జరుగుతున్నాయట. ఇకపోతే ఈ సినిమాతో పాటు వరుణ్.. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చేయనున్నారని ఇన్ సైడ్ టాక్.