ఎన్నికల బరిలోకి మెగా ఫ్యామిలీ దిగనట్లే!
జనసేనాని పవన్ కళ్యాణ్ అదేశిస్తే ఎన్నికల ప్రచార బరిలోకి దిగడానికి సిద్దంగా ఉన్నామని ఇప్పటికే రామ్ చరణ్.. సాయితేజ్ ..వరుణ్ తేజ్ ఇంకా మిగతా మెగా ఫ్యామిలీ అంతా సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
2024 ఏపీ ఎన్నికల బరిలోకి మెగాఫ్యామిలీ దిగనట్లేనా? కూటమి పోరులో జనసేనాని ఫ్యామిలీని దూరం పెట్టే అవకాశం ఉందా? అంటే సన్నివేశం దాదాపు అలాగే కనిపిస్తుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ అదేశిస్తే ఎన్నికల ప్రచార బరిలోకి దిగడానికి సిద్దంగా ఉన్నామని ఇప్పటికే రామ్ చరణ్.. సాయితేజ్ ..వరుణ్ తేజ్ ఇంకా మిగతా మెగా ఫ్యామిలీ అంతా సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాళ్ల ప్రకటన.. జనసేనానిని పోరాటం చూసి ఒకానొక దశలో మళ్లీ మెగా ఫ్యామిలీ అంతా దిగడం లాంఛనమే అనుకున్నారు.
అప్పట్లో ప్రజారాజ్యం కోసం చిరంజీవి ఎలా మెగా హీరోల్ని తెరపైకి తెచ్చారా? సేనాని కూడా తెస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు అందుకు ఆస్కారం ఏమాత్రం లేదని తేలిపోయింది. జనసేన టీడీపీ తో కలిసి ఎన్నికలకు వెళ్తోన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఎవర్నీ దించే అవకాశం లేదు. కొత్తగా ఆ కుటమిలో కి బీజేపీ కూడా చేరింది కాబట్టి! అస్సలు ఛాన్సే లేదని తెలుస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సోలోగానే ప్రకటించారు. అప్పటి నుంచి సోలాగానే జనాల మధ్యలో తిరుగుతు న్నారు.
ఇప్పటివరకూ ఏ మెగా హీరోని తన పార్టీ కోసం గానీ..క్యాపెనింగ్ కోసం రమ్మని పిలిచింది లేదు. మెగా ఫ్యామిలీ హీరోలంతా తమకు తాముగా స్వచ్ఛందంగా వస్తామన్నారు తప్ప సేనాని ఆహ్వానించింది లేదు. కేవలం నాగబాబుని మాత్రమే పార్టీలోకి అహ్వానించి కొన్ని పనులు అప్పగించారు. మధ్యలో ఆయన కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ నాగబాబు యాక్టివ్ అయ్యారు.
అయితే పవన్ గనుక సింగిల్ గా పోటీ చేస్తే మెగాసైన్యమంతా ప్రచార బరిలో దిగడానికి అవకాశం ఉండేది. సేనాని ఒంటరి పోరాటానికి తోడుగా వాళ్లు కూడా జత కలిసేవారు. చిరంజీవి దూరంగా ఉన్నా చరణ్.. వరుణ్ తేజ్..సాయితేజ్..వైష్ణవ్ తేజ్...అవసరం అనుకుంటే బన్నీ కూడా సీన్ లోకి వచ్చేవారు. కానీ తాజా సన్నివేశం చూస్తుంటే ఆ ఊపు ఎక్కడా కనిపించలేదు. అయితే నాగబాబు..పవన్ కళ్యాణ్ పోటీచేసే నియోజకవర్గాలు ఖరారైతే కనీసం అక్కడైనా క్యాపెనింగ్ కోసం దిగుతారేమో చూడాలి.