మెగా మేనల్లుడు ఆన్ స్ట్రైక్..!
తేజ్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని టాక్. అంతేకాదు సినిమా కోసం సాయి ధరం తేజ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో అతని తక్కువ టైంలోనే ఫ్యాన్స్ ని మెప్పించిన యాక్టర్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమా సెట్స్ మీదకు వెళ్లింది రేయ్ అయినా రిలీజైంది మాత్రం పిల్లా నువ్వు లేని జీవితం. ఆ సినిమాలోని సాయి తేజ్ ఎనర్జీ చూసే మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఫ్యాన్స్ సపోర్ట్ తో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా సాయి తేజ్ కథలు ఉంటాయి. ఐతే కెరీర్ మంచి జోరు మీద ఉన్న టైం లో యాక్సిడెంట్ వల్ల కాస్త వెనకపడ్డాడు.
కొద్దిపాటి గ్యాప్ తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలు చేసిన సాయి తేజ్ తన నెక్స్ట్ సినిమా కోసం మళ్లీ టైం తీసుకుంటున్నాడని అన్నారు. సంపత్ నందితో గాంజా శంకర్ సినిమా మొదలు పెట్టిన తేజ్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ సినిమాను ఆపేయాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ గా రోహిత్ అనే కొత్త దర్శకుడితో ఈసారి భారీ ప్లాన్ తోనే వస్తున్నాడు సాయి తేజ్. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది.
తేజ్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని టాక్. అంతేకాదు సినిమా కోసం సాయి ధరం తేజ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది. తేజ్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఇది ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం సాయి తేజ్ తనౌ తాను సిద్ధం చేసుకుంటున్నాడు. కెరీర్ లో ఒక మంచి సాలిడ్ హిట్ కోసం చూస్తున్న తేజ్ రాబోతున్న ఈ సినిమాతో భారీ టార్గెట్ ని పెట్టుకున్నాడు.
మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సాయి ధరం తేజ్ అంటే ఇష్టం ఉన్న కామన్ ఆడియన్స్ కూడా అతను కెరీర్ లో సక్సెస్ అవ్వాలని కోరుతున్నారు. మరి తేజ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. హనుమాన్ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో నిర్మాత నిరంజన్ రెడ్డి తేజ్ సినిమాకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని అంటున్నారట. సాయి ధరం తేజ్ కూడా ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని తెలుస్తుంది. మరి ఇంతకీ మెగా మేనల్లుడి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.