చిరు రెండో సారి కూడా ఆ తప్పు చేస్తే..?
గత నెలలో సూపర్ స్టార్ రజనీకాంత్-మెగాస్టార్ చిరంజీవి తమ కొత్త చిత్రాలు జైలర్, భోళాశంకర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే
గత నెలలో సూపర్ స్టార్ రజనీకాంత్-మెగాస్టార్ చిరంజీవి తమ కొత్త చిత్రాలు జైలర్, భోళాశంకర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రాల్లో జైలర్ వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. భోళాశంకర్ చిరు కెరీర్లోనే భారీ డిజాస్టర్ టాక్‌ను అందుకుంది. అయితే బ్లాక్ బస్టర్ జైలర్ సినిమాలో హీరోగా చిరు నటిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోండి.. బాగుంది కదూ. వాస్తవానికి ఇదే జరగాల్సిందట.
అవును మీరు చదివింది నిజమే. ఈ కథ మొదట చిరు దగ్గరికే వెళ్లిందట. జైలర్ దర్శకుడు నెల్సన్ కుమార్.. ఈ స్టోరీని చిరంజీవికి చెప్పారట. బీస్ట్ సినిమా షూటింగ్ సమయంలో.. నెల్సన్ జైలర్ గురించి నెరేషన్ చేశారట. అయితే ఈ చిత్రంలో సాంగ్స్, డ్యాన్స్ ఏమీ లేకపోవడం ఆలోచించి చెబుతానని అన్నారట. ఆ తర్వాత బీస్ట్ సినిమా రిలీజై ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో చిరు సైలెంట్‌గా ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారట. తన దగ్గర ఉన్న ఇతర తెలుగు సినిమాల కమిట్మెంట్స్తో ముందుకెళ్లారు. ఇక నెల్సన్.. రజనీతో జైలర్ తీశారు. అది కాస్త బాక్సాఫీస్ వద్ద ఏకంగా లాంగ్ రన్ టైమ్‌లో రూ.650కోట్లకు పైగా వసూళ్లను అందుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అటు రజనీకి ఇటు నెల్సన్‌కు గట్టి కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది.
అయితే ఇప్పుడు.. దర్శకుడు నెల్సన్ హైదరాబాద్ రానున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలవబోతున్నారట. మరి ఏమైనా కథ చెబుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన చెప్పినా చెప్పకపోయినా.. చిరు మాత్రం నెల్సన్‌ను లైన్లో పెట్టడం మంచిదని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చిరు ఈ రెండో సారి కూడా మిస్ అయ్యారా.. ఇది కచ్చితంగా చిరు తప్పే అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఇకపోతే చిరు ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో ఓ భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. అలాగే తన కూతురు నిర్మిస్తున్న ఓ చిత్రంలోనూ నటించనున్నారు. ఈ రెండు చిత్రాలు ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇక నెల్సన్ కుమార్ తన నెక్ట్స్ చిత్రం ఎవరితో చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.