మళ్ళీ పాన్ ఇండియా రేస్ లోకి మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు మెగాస్టార్ సిద్ధం అవుతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.
తమన్నా భాటియా ఈ మూవీలో మెగాస్టార్ కి జోడిగా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో బ్రో డాడీ సినిమా రీమేక్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
దీని తర్వాత మరల మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా రేస్ లోకి రాబోతున్నారు. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి సినిమాతో మెగాస్టార్ పాన్ ఇండియా మూవీ చేశారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత బింబిసారా ఫేమ్ వశిష్ట మల్లిడితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ మూవీ ఉండబోతోంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చేయబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. సుమారు 250 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలోనే ఈ సినిమాను కూడా డిఫరెంట్ సోషియో ఫాంటసీ బ్యాడ్ డ్రాప్ లోనే వశిష్ట మల్లిడి ఆవిష్కరించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చడంతో ఈ కాన్సెప్ట్ కి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కించుకోవాలని అనుకున్న అది సాధ్యం కాలేదు. మరి వశిష్ఠ మల్లిడి అయిన మెగాస్టార్ కి సూపర్ హిట్ ఇస్తాడేమో చూడాలి.