మెగాస్టార్ చిరంజీవికి UAE గోల్డెన్ వీసా
యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన భారతీయుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు
యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన భారతీయుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. UAE సాంస్కృతిక పర్యాటక శాఖ టాలీవుడ్ మెగాస్టార్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఈ వీసా కాలపరిమితి పది సంవత్సరాలు.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరబ్ ప్రభుత్వం ఇటీవల గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఇప్పుడు చిరంజీవికి ఆ ఘనత దక్కింది. UAE ప్రభుత్వం మొదటిసారిగా 2019లో గోల్డెన్ వీసా కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది. ఈ వీసాకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. విశేష వీసా విధానంతో విదేశీయులు జాతీయ స్పాన్సర్ అవసరం లేకుండా తమ దేశంలో నివసించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది. వీసా హోల్డర్లు UAE ప్రధాన భూభాగంలో వారి వ్యాపారంపై 100 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉంటారు. ఐదు లేదా 10 సంవత్సరాల కాలానికి ఉండే ఈ వీసాలు స్వయంచాలకంగా పునరుద్ధరించుకనే వీలుంది.
చిరంజీవి కంటే ముందు ఆయన వారసుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కామినేని .. మేనల్లుడు అల్లు అర్జున్‌కు ఈ గౌరవనీయమైన వీసా మంజూరు అయింది. తాజాగా చిరంజీవికి దక్కిన గౌరవం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఆనందపరిచింది. రజనీకాంత్, షారూఖ్ ఖాన్, సంజయ్ దత్, సోనూ సూద్, రణవీర్ సింగ్, సానియా మీర్జా, మౌని రాయ్ వంటి వారు UAE దీర్ఘకాల నివాస వీసాలకు ప్రారంభ గ్రహీతలుగా ఉన్నారు.