మెగా అప్డేట్.. అనుకున్నట్టే అయ్యింది
కానీ ఆ తర్వాత వశిష్ఠ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్, రకరకాల ఊహాగానాలు వంటి వార్తలు వచ్చాయే తప్ప.. కళ్యాణ్ కృష్ణ సినిమాకు సంబంధించి ఏమీ రాలేదు.
అనుకున్నద్దే జరిగింది. కల్యాణ్ కృష్ణ సినిమాను మెగాస్టార్ చిరింజీవి పక్కనపెట్టారు. మెగా 156గా వశిష్ఠతో కలిసి సినిమాను చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని గ్రాఫిక్స్‌తో డిజైన్ చేసిన ఓ స్పెషల్ పోస్టర్‌తో మేకర్స్ క్లారిటీ చేశారు. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
వివరాళ్లోకి వెళితే.. భోళాశంకర్ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఒకటి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో మరొకటి బింబిసార ఫేమ్ వశిష్ఠతో. మెగా 156గా కళ్యాణ్ కృష్ణతో రాగా.. మెగా 157గా వశిష్ఠ సినిమా రాబోతుందని ప్రచారం చేశారు.
కానీ ఆ తర్వాత వశిష్ఠ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్, రకరకాల ఊహాగానాలు వంటి వార్తలు వచ్చాయే తప్ప.. కళ్యాణ్ కృష్ణ సినిమాకు సంబంధించి ఏమీ రాలేదు. దీంతో కల్యాణ్ కృష్ణ సినిమాను చిరు పక్కనపెట్టారనే ప్రచారం సాగింది. ఇప్పుడా ప్రచారమే నిజమైంది. దసరా పండగా సందర్భంగా రాత్రికి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. మూవీ నిర్మామ సంస్థ యూవీ క్రియేషన్స్.. ఒక గ్రాఫిక్‌తో చేసిన ఆయుధమున్న పోస్టర్‌ను విడుదల చేసింది.
మెగా 157 నెంబర్‌ను మెగా156గా మార్చి విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. అంటే భోళా శంకర్ తర్వాత ఇప్పుడు రానున్న సినిమా ఇదేనన్న మాట. భోళా శంకర్ డిజాస్టర్ కావడం, కథల సెలక్షన్స్‌పై భారీగా విమర్శలు రావడంతో.. చిరు ఆత్మపరిశీలన చేసుకుని రీమేక్‌ను నో చెప్పి.. ఫాంటసీకి షిఫ్ట్ అయిపోయారు.
ఇకపోతే సినిమాకు సంబంధించి పాట రికార్డింగ్‌తో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారట. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక సాంగ్‌ను రికార్డు చేసినట్టు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏమీ లేదు. ఈ చిత్రం పూర్తవ్వడానికి వచ్చే ఏడాది అయ్యేలా ఉంది. 2025 సంక్రాంతికి బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నలుగురు హీరోయిన్లు నటించే అవకాశముందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..