లాంగ్ ఫ్రాక్ లో మెహ్రీన్ అందాలు.. చూస్తే ఫిదానే!

పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్న అమ్మడు.. ఔటింగ్ కు వెళ్లిన ఫోటోలు షేర్ చేసింది. క్రేజీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని కనిపించింది.

Update: 2024-09-24 01:30 GMT

మెహ్రీన్ పిర్జాదా.. నేచురల్ స్టార్ నాని కృష్ణ గాడి వీర ప్రేమగాథ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఫిల్లౌరి మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. శర్వానంద్ తో కలిసి చేసిన తన రెండో తెలుగు సినిమా మహానుభావుడు మంచి హిట్ అయింది. మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ లో లక్కీగా నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ లో అనేక సినిమాలు చేసింది.

 

దాదాపు మెహ్రీన్ యాక్ట్ చేసిన సినిమాలు అన్నీ హిట్స్ అయ్యాయి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా తెరకెక్కించిన F2, F3లో మంచి ఛాన్స్ కొట్టేసింది. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించి హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ బాగానే మార్కులు సంపాదించుకుంది. క్రేజ్ కూడా దక్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.

 

కొద్ది రోజుల తర్వాత అఫీషియల్ గా ఆ విషయాన్ని అనౌన్స్ చేసింది అమ్మడు. కానీ ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పింది. ఎంగేజ్మెంట్ కాగానే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని చెప్పిన ఆమె.. మళ్లీ సినిమాలకు సైన్ చేసేందుకు రెడీ అయింది. కానీ ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న ఆమెకు ఇప్పుడు లక్ కలిసి రావడం లేదు. అనుకున్న స్థాయిలో ఛాన్సులు అందుకోలేకపోతోంది. రీసెంట్ గా ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఫాలో అయ్యి.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక నెట్టింట మెహ్రీన్ సందడి మామూలుగా ఉండదు. యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ పోస్ట్ చేస్తుంటోంది. సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది అమ్మడు. వారిని అసలు డిస్సపాయింట్ చేయకుండా తన గ్లామర్ షోతో అలరిస్తుంటోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో పిక్స్ దిగుతూ బ్యూటీ షేర్ చేస్తుంటోంది. తన అందాల ఆరబోతతో మైమరపిస్తుంటోంది. తాజాగా కొత్త పిక్స్ ను పంచుకుంది మెహ్రీన్ పిర్జాదా.

పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్న అమ్మడు.. ఔటింగ్ కు వెళ్లిన ఫోటోలు షేర్ చేసింది. క్రేజీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని కనిపించింది. హీట్ పుట్టించే పోజు ఇచ్చి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. అదే సమయంలో తన ఫ్రెండ్ ను కూడా పరిచయం చేస్తూ.. హ్యాపీ గర్ల్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం మెహ్రీన్ పిర్జాదా నయా పిక్చర్స్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మెహ్రీన్ సో బ్యూటిఫుల్, సో గ్లోరియస్ అంటూ నెటిజన్లు ఫుల్ గా కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News