మెహ్రీన్.. రొమాంటిక్ సీన్స్ లో బలవంతంగా..
టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ మెహరీన్. ఈ బ్యూటీ అప్పుడప్పుడు హిందీలో కూడా మూవీస్ చేస్తోంది
టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ మెహరీన్. ఈ బ్యూటీ అప్పుడప్పుడు హిందీలో కూడా మూవీస్ చేస్తోంది. అయితే ఎన్నడూ లేని విధంగా మొదటిసారి వెబ్ సిరీస్ లో బోల్డ్ అటెంప్ట్ చేసింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ తెరంగేట్రం చేసన మెహరీన్ అందులో ఇంటిమేట్ లిప్ కిస్ సన్నివేశాలలో నటించింది.
కథలో భాగంగా ఆ సన్నివేశాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో కొంత మంది వాటిని షేర్ చేస్తూ మెహరీన్ ఇంటిమేట్ సన్నివేశాలు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తమన్నా కూడా లస్ట్ స్టోరీస్ 2లో చేసిన ఇంటిమేంట్ సన్నివేశాలని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే మెహరీన్ చేసిన ఈ సన్నివేశాలు వైరల్ చేస్తున్నారు.
అయితే ఈ సీన్స్ వైరల్ చేయడం మెహరీన్ కి సమస్య కాలేదు. కాని వాటిని ఇంటిమేంట్ రొమాంటిక్ సన్నివేశాలుగా ప్రచారం చేయడం మాత్రం హర్ట్ అయ్యింది. దీనిపై ఇన్ స్టాగ్రామ్ లో అవి ఇంటిమేట్ సె** సన్నివేశాలు కాదని, వైవాహిక బంధంతో క్రూరమైన రే** సీన్స్ అంటూ వివరణ ఇచ్చింది. ఒక నటిగా ఒక్కోసారి ఇలాంటి సన్నివేశాలలో నటించాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.
అందులో తప్పులేదని, కాకపోతే వాటిని సంబోధించే విషయంలో అభ్యంతరం ఉందని పేర్కొంది. ఏ ఒక్కరు కూడా వైవాహిక బంధంలో ఎలాంటి క్రూరమైన అత్యాచారానికి కి గురికాకూడదు అని చెప్పడానికి ఈ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందని మెహరీన్ చెప్పుకొచ్చింది. నిజంగానే మెహరీన్ చేసిన ఆ సన్నివేశాలు రొమాంటిక్ సీన్స్ గా కంటే బలవంతం చేస్తున్నట్లు ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి.
ఎలాంటి సన్నివేశాలలో నటించడానికి నటిగా గట్స్ కావాలి. నిజంగా మెహరీన్ చాలా ధైర్యం చేసి ఈ సన్నివేశాలని ఓపెన్ గా చేసి తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ప్రూవ్ చేసుకుంది. ఆమె వివరణ తర్వాత అయిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ సన్నివేశాలపై నెటిజన్లుకి క్లారిటీ వస్తుందేమో చూడాలి.