'రక్షణ కల్పించండి'... మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు!
ఆదివారం ఉదయం నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్న "మోహన్ బాబు - మనోజ్" ఎపిసోడ్ లో అత్యంత కీలక పరిణామాలు వరుసపెట్టి జరుగుతున్నాయి!
ఆదివారం ఉదయం నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్న "మోహన్ బాబు - మనోజ్" ఎపిసోడ్ లో అత్యంత కీలక పరిణామాలు వరుసపెట్టి జరుగుతున్నాయి! ఇందులో భాగంగా... తనపై 10 మంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని చెబుతోన్న వేళ.. మోహన్ బాబు ఎంట్రీ సంచలనంగా మారింది!
అవును... మంచు మోహన్ బాబు తాజాగా పోలీసులను ఆశ్రయించారు! తన కుమారుడు, నటుడు మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు! తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని ఆయన కోరారు!
ఇందులో భాగంగా... సర్వే నెం.194, మంచు టౌన్, జల్ పల్లి, రంగారెడ్డి జిల్లాలోని చిరునామాలో తాను 10 సంవత్సరాలుగా నివసిస్తున్నానని.. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్న కుమారుడు మనోజ్ డిసెంబర్ 8వ తేదీన కొంతమంది సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడని అందులో పేర్కొన్నారు.
ఇదే సమయంలో.. మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడని.. రాత్రి 9 గంటలకు నేను పడుకుని ఉన్న సమయంలో మళ్లీ నా ఇంటికి వచ్చాడని తెలిసిందని.. ఆ మరునాడు నేను నా పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కోంతమంది అపరిచితులను నా ఇంటి చుట్టూ తిరగడం గమనించానని మోహన్ బాబు కమిషనర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
అదే సమయంలో... మాదాపూర్ లోని నా ఆఫీసులోకి మంచు మనోజ్ అనుచరులమని ఓ 30 మంది వ్యక్తులు చొరబడ్డారని.. ఈ ఆస్తి మాది, మా అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రాలేరని బెదిరించినట్లుగా అక్కడ ఆఫీసు సిబ్బంది కాల్ చేసి చెప్పారని మోహన్ బాబు తెలిపారు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా.. తన భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నట్లు మోహన్ బాబు తెలిపారు. అదేవిధంగా.. తనకు హాని కలిగించే ఉద్దేశ్యంతో వారు ఉన్నారని.. నా నివాసాన్ని శాస్వతంగా ఖాళీ చేయాలని బెదిరించారని.. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్నవారికి ప్రాణహాని కలిగిస్తున్నారని మోహన్ బాబు పేర్కొన్నారు.
ఈ సమయంలో.. చట్టవిరుద్ధంగా తన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వారిద్దరూ ప్లాన్ చేశారని.. తాను 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ని అని.. మనోజ్, మౌనిక, అతడి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని.. రక్షణ కల్పించాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో కోరారు!