టాలీవుడ్ స్పూర్తితోనే మాలీవుడ్ లో ఇంత‌టి ర‌క్త‌ పాత‌మా?

అయితే ఇప్పుడా ప‌రిశ్ర‌మ కూడా గేర్ మార్చింది. అవార్డు సినిమాల‌తో పాటు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేయ‌డం మొద‌లైంది.

Update: 2025-01-02 14:30 GMT

మాలీవుడ్ రూట్ మార్చిందా? అవార్డులు అందుకునే ఆర్ట్ చిత్రాల నుంచి క‌మర్శియ‌ల్ పంథాలోకి మారుతుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి మాలీవుడ్ ప‌రిశ్ర‌మ గుర్తింపు అన్న‌ది ఎంతో యూనిక్ గా ఉంటుంది. కాన్సెప్ట్ బేస్ట్ చిత్రాలు తెర‌కెక్కించ‌డంలో అక్క డైరెక్ట‌ర్లు అంతా మాస్ట‌ర్లు. అందుకే జాతీయ‌, అంత ర్జాతీయ స్థాయిలో అవార్డులు అక్క‌డ ప‌రిశ్ర‌మ‌కి ఎక్కువ‌గా ద‌క్కుతుంటాయి. అస్కార్ నామినేషన్స్ లో ఇండియా నుంచి ఎక్కువ‌గా మాలీవుడ్ సినిమాలే ఎంపికైన జాబితాలో ఉంటాయి.

అయితే ఇప్పుడా ప‌రిశ్ర‌మ కూడా గేర్ మార్చింది. అవార్డు సినిమాల‌తో పాటు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేయ‌డం మొద‌లైంది. మునుప‌టి కంటే ఇప్పుడు మాలీవుడ్ స‌క్సెస్ రేట్ మెరుగ్గా ఉంది. అక్కడ సినిమాలు టాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతున్నాయి. ఈ మార్పు గ‌డిచిన ఐదేళ్ల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. క‌మ‌ర్శియ‌ల్ కోణంలో తెర‌కెక్కిన సినిమాల్ని టాలీవుడ్ సైతం రీమేక్ చేసి స‌క్సెస్ లు అందుకుంటుంది. కాన్సెప్ట్ బేస్ట్ చిత్రాల్లో కూడా కాస్త క‌మ‌ర్శి యాల్టీని జొప్పించి కాసులందుకునే టెక్నిక్ ని ప‌ట్టుకున్నారు.

దీంతో ఇండ‌స్ట్రీ స‌క్సెస్ రేట్ బాగా పెరిగింది. అక్క‌డ న‌టులు దేశవ్యాప్తంగా వెలుగులోకి వ‌స్తున్నారు. ఒకప్పుడు మ‌ల‌యాళం న‌టులంటే మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ పేర్లు మాత్ర‌మే ఎక్కువ‌గా వినిపించేవి. కానీ నేడు త‌ర్వాత జ‌న‌రేష‌న్ హీరోల పేర్లు కూడా పాన్ ఇండియాలో బాగానే వెలుగులోకి వ‌స్తున్నాయి. అందులోనూ అక్క‌డ సినిమాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. `2018`,` మంజ‌మ్మ‌ల్ బోయ్స్`, లాంటి సినిమాలు తెలుగులో కాసుల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే `ఉన్ని ముకుంద‌న్` న‌టించిన `మార్కో` రిలీజ్ అయింది. హ‌నీఫ్ అదేని తెర‌కెక్కించిన ఈ ఆక్టేన్ యాక్ష‌న్ చిత్రాన్ని చూసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు నివ్వెర పోతున్నారు. మాలీవుడ్ ప‌రిశ్ర‌మ నుంచి ఇంత‌టి దారుణ‌మైన ర‌క్త‌పాత‌మా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ రేంజ్ లో హింస‌ను ఏ డైరెక్ట‌ర్ వెండి తెర‌పై ఆవిష్క‌రించ‌లేదు. చేస్తే అది సంల‌చ‌ల‌న‌మే అవ్వాలి అన్న‌ట్లు హ‌నీఫ్ అత్యంత క‌ర్క‌శంగా ఈ సినిమాని తెర‌కెక్కించాడు.

ఇప్ప‌టికే సినిమా 100 కోట్ల క్ల‌బ్ లో నూ చేరింది. మాలీవుడ్ నుంచి ఏమాత్రం ఊహించ‌ని కంటెంట్ ఇది. బ‌హుశా ఈ మార్పుకు ప‌రోక్షంగా టాలీవుడ్ కార‌ణం కావొచ్చు. తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ చూసి ప‌క్క‌నే ఉన్న కోలీవుడ్ హీరోలే దిగొచ్చారు. నెంబ‌ర్ వ‌న్ అంటూ విర్ర వీగిన బాలీవుడ్ కూడా దిగొచ్చింది. ఇన్ని ర‌కాల మార్పులు చూసి మాలీవుడ్ కూడా మారిన‌ట్లుంది.

Tags:    

Similar News