ఇండస్ట్రీ ఊరిస్తున్నా..హీరోలు భయపెడుతున్నారా?
స్టార్ హీరోల సినిమాలు హిట్ టాక్ వచ్చిందంటే కోట్లు గుమ్మరిస్తాయి. నిర్మాత లు.. డిస్ట్రిబ్యూ టర్లు ...బయ్యర్లు అంతా లాభాలు భారీ ఎత్తున చూస్తారు
స్టార్ హీరోల సినిమాలు హిట్ టాక్ వచ్చిందంటే కోట్లు గుమ్మరిస్తాయి. నిర్మాత లు.. డిస్ట్రిబ్యూటర్లు ...బయ్యర్లు అంతా లాభాలు భారీ ఎత్తున చూస్తారు. అదే సినిమా ప్లాప్ అయితే నష్టాలు భరిస్తారు. ఇది ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ల మధ్య ఓ సైక్లిక్ ప్రోసస్. ఓ సినిమా లాభాలిస్తే మరో సినిమా నష్టాలిస్తుంది. నష్టాలు తట్టుకుని నిలబడే సామర్ధ్యం నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ల కు ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో లాంగ్ రన్ ఉంటుందని అగ్ర నిర్మాత దిల్ రాజు తన అనుభవాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు.
హీరో మార్కెట్ ని మించి ఖర్చు చేస్తే నష్టాలు ఎలా ఉంటాయో కూడా ఆయన అనుభవంలో ఎంతో మందిని చూసారు. అందుకే నిర్మాత ఓ సినిమా చేస్తున్నప్పుడు కథని బలంగా నమ్మి ముందుకెళ్లమని ఎప్పటికప్పడు చెబుతున్నారు. ఆమధ్య దీనిపై ఏకంగా ఓ సమావేశం సైతం ఏర్పాటు చేసి నిర్మాతల మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేసారు. ఇలా రాజుగారి మాటలు తలకెక్కించుకుని కొంత మంది చిన్న నిర్మాతలు సేఫ్ జోన్ లో జర్నీ చేస్తున్నారు.
అయితే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే నిర్మాతలు మాత్రం కొంత మంది హీరోల చేతిలో మోసపోతున్న వైనం కనిపిస్తుంది అన్న అంశం చర్చకొస్తుంది. మీడియం రేంజ్ హీరోల నుంచి యువ హీరోల వరకూ కొంత మంది వాళ్ల మార్కెట్ ని మించి పారితోషికం డిమాండ్ చేయడంతోనే ఈ రకమైన సన్నివేశం నిర్మాతలకు ఎదురవుతుంది. థియేట్రికల్ గా..నాన్ థియేట్రికల్ గా కొంత మంది హీరోలకు సరైన మార్కెట్ లేదు. కానీ పారితోషికం విషయంలో మాత్రం సదరు హీరోలు ఒక్క మెట్టు కూడా దిగడం లేదంటున్నారు.
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న చందంగా పట్టిన పట్టు వదలకుండా నిర్మాతల వద్ద పారితోషికం డిమాండ్ చేస్తున్నారుట. ఇలాంటి హీరోల లిస్ట్ ఇండస్ట్రీలో చాలా పెద్దదే ఉందని వినిపిస్తుంది. యువ హీరోల నుంచి కొంత మంది మీడియం రేంజ్ హీరోల వరకూ ఇదే విధానంలో నిర్మాతల్ని ఇబ్బంది పెడుతు న్నారనే ప్రచారం సాగుతోంది. మీడియంరేంజ్ హీరోలతో సినిమాలు తీయాలంటే హీరో పారితో షికం సహా నిర్మాణ కలుపుకుంటే ఈజీగా 40 కోట్లు ఖర్చు అవుతుంది.
కానీ రిటర్న్స్ విషయంలో ఆ ఫిగర్ దరిదాపుల్లో కూడా ఉండటం లేదు. ఇప్పుడు ఓటీటీ కి వెళ్లాలంటే? రకరకా కోణాల్లో విశ్లేషించి కంటెంట్ ని విక్రయిస్తున్నారు. ఇంతకు ముందులా బ్లైండ్ గా విక్రయం జరగటం లేదు. థియేట్రికల్ బిజినెస్..రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ ని ఆధారం చేసుకుని కొంటున్నాయి ఓటీటీలు. అదీ పుల్ పేమెంట్ ఒకేసారి ఇవ్వడం లేదు. ఓటీటీలో ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఎంత ఇవ్వాలి అన్నది డిసైడ్ చేస్తున్నాయి కొన్ని పెద్ద ఓటీటీ సంస్థలు.
కానీ హీరోలకు మాత్రం ఈ లెక్కలేవి అవసరం లేదన్నట్లే సన్నివేశం కనిపిస్తుంది. ఈ కారణంగానే ఇండస్ట్రీ కి కొత్త నిర్మాతలు రావాలంటే వెనకడుగు వేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకు ముందు కొత్త నిర్మాతలు చిన్న సినిమాలతో ఇండస్ట్రీ కళ కళలాడేది. కానీ కోవిడ్ దెబ్బతో కొత్త వాళ్లు కనిపించడమే లేదు. తెగించి కొంత మంది నిర్మాతలు ముందుకొస్తే హీరోలు పట్టపగలే చుక్కులు చూపిస్తున్నారు. ఇలా ఉంది ఇండస్ట్రీలో పరిస్థితి.