జాన్వి కపూర్ Mr & Mrs మహి.. ఎలా ఉందంటే..!

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో మినీ సమీక్షలో చూసేద్దాం.

Update: 2024-06-01 12:34 GMT

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న జాన్వి కపూర్ సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుంది. దేవర తో పాటుగా చరణ్ 16వ సినిమాలో కూడా జాన్వి కపూర్ నటిస్తుంది. ఐతే బాలీవుడ్ లో జాన్వి నటించిన Mr & Mrs మహి సినిమా లేటెస్ట్ గా రిలీజైంది. కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాను శరణ్ శర్మ డైరెక్ట్ చేశారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో మినీ సమీక్షలో చూసేద్దాం.

ఇంతకీ అసలు Mr & Mrs మహి కథ ఏంటి అంటే. మహేంద్ర అగర్వాల్ (రాజ్ కుమార్ రావు) చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ప్రేమని పెంచుకుంటాడు. పెద్దయ్యాక ఎలాగైనా ఇండియన్ టీం లో ఆడాలని అనుకుంటాడు. ఐతే పరిస్థితులు అతన్ని క్రికెటర్ ని కానివ్వవు. తండ్రి స్పోర్ట్స్ షాప్ ను చూసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ టైం లో మహిమా (జాన్వి కపూర్) తో మహేంద్ర అగర్వాల్ కు పెళ్లవుతుంది. ప్రొఫెషనల్ గా డాక్టర్ అయిన మహిమ అతనిలానే క్రికెట్ మీద ఆసక్తి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న మహేంద్ర మహిమా కోసం ఏం చేశాడు..? వీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్యామిలీ ఏం చేసింది..? ఫైనల్ గా ఏం జరుగుతుంది అన్నది సినిమా కథ.

బాలీవుడ్ లో స్పోర్ట్స్ డ్రామాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎంచుకున్న కథను అంతే ఎమోషన్ తో తెరకెక్కిస్తారు. Mr & Mrs మహి సినిమా కూడా అంతే ఎమోషన్ తో కూడా కథతో వచ్చింది. కానీ ఆ ఎమోషన్ ని పండించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. సినిమా కొన్ని చోట్ల నాని జెర్సీని గుర్తు చేస్తుంది. Mr & Mrs మహి ట్రైలర్ చూస్తే సినిమా కథ అర్థమవుతుంది. ఐతే ట్రైలర్ లో ఇంట్రెస్ట్ కలిగేలా చేసిన దర్శకుడు సినిమాను మాత్రం డల్ గా నడిపించాడు. ఎమోషన్స్ కూడా అంతగా కనెక్ట్ కాకపోవడంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు.

ఉన్నంతలో ఇచ్చిన పాత్రలకు న్యాయం చేసిన రాజ్ కుమార్ రావు నటన ఆకట్టుకుంటుంది. జాన్వి కపూర్ కూడా మహిమ పాత్రలో ఆకట్టుకుంది. ఎమోషన్ సీన్స్ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో విధంగా ఉండేది. కానీ ఊహించే కథనం.. ఎమోషన్స్ పండాల్సిన చోట సరిగా పండకపోవడంతో సినిమాను చూసిన ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.

ట్విస్ట్ ఏంటంటే Mr & Mrs మహి సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ దేవర టీం మాత్రం జాన్వి తెలుగు తొలి పరిచయం దేవర తోనే ఉండాలని సీరియస్ గా చెప్పారట. Mr & Mrs సినిమా ఎఫెక్ట్ దేవర మీద పడకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న టాక్ చూస్తే అదే మంచిందనిపించింది.

Tags:    

Similar News