మిస్టర్ బచ్చన్ సెన్సార్ రిపోర్ట్.. సర్ ప్రైజ్ ఏమిటంటే..

చాలా రోజుల తర్వాత ఓ మంచి ఆల్బమ్ తో మిస్టర్ బచ్చన్ మూవీ వచ్చిందని చెప్పొచ్చు.

Update: 2024-08-13 11:30 GMT

మాస్ మహారాజ్ రవితేజ ఆగష్టు 15న మిస్టర్ బచ్చన్ తో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ జె మియర్ మిస్టర్ బచ్చన్ సినిమాకి అదిరిపోయే మాస్ బీట్స్ తో పాటు రొమాంటిక్ సాంగ్స్ ని అందించారు. అలాగే సూపర్ మెలోడీని కూడా ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి ఆల్బమ్ తో మిస్టర్ బచ్చన్ మూవీ వచ్చిందని చెప్పొచ్చు.


ట్రైలర్ కూడా కమర్షియల్ లైన్ లో సినిమా ఉండబోతోందని స్పష్టం చేసింది. ఇలాంటి కథలు చెప్పడంలో హరీష్ శంకర్ దిట్ట. అందుకే మిస్టర్ బచ్చన్ సినిమాపై ప్రేక్షకులలో కూడా కొంత హైప్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బృంద సభ్యులు మిస్టర్ బచ్చన్ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్ర యూనిట్ ఈ సెన్సార్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేసింది.

సెన్సార్ టాక్ ప్రకారం సినిమాలో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇన్ కమ్ ట్యాక్స్ తరహా అంశాలను కూడా హైలెట్ చేసినట్లు సమాచారం. హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ కూడా మరో హైలెట్ పాయింట్. రవితేజ హీరోయిజం కూడా ఇందులో చాలా కొత్తగా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే మరో కీలక అప్డేట్ కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చింది.

ప్రేక్షకుల కోరిక మేరకు మిస్టర్ బచ్చన్ స్పెషల్ ప్రీమియర్ షోలని ఆగష్టు 14న వేస్తున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు. అలాగే ఎక్స్ ట్రా షోలు కూడా యాడ్ చేసినట్లు తెలిపారు. ప్రీమియర్ షోల కోసం టికెట్ లు బుక్ చేసుకోవాలని లింక్ కూడా ట్విట్టర్ పోస్ట్ లో మెన్షన్ చేశారు. సినిమాపైన కాన్ఫిడెన్స్ తో మూవీ స్పెషల్ ప్రీమియర్ షోలు ఒక రోజు ముందుగానే వేస్తున్నట్లు తెలుస్తోంది.

మాస్ మహారాజ్ నుంచి ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారు. ధమాకా తర్వాత ఆ స్థాయిలో అవుట్ అండ్ అవుట్ ఫన్ ని అందించే మూవీ కావాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీ వారి కోరికని కచ్చితంగా తీరుస్తుందని చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది. రవితేజ సినిమాలలో మిస్టర్ బచ్చన్ ఒక స్పెషల్ చిత్రంగా ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News