అంతర్జాతీయ స్టార్ జెండయా స్ఫూర్తితో
అయితే దక్షిణాదిన ఎన్ని అవకాశాలు ఉన్నా.. హిందీ చిత్రసీమలోను వెలిగేందుకు మృణాల్ ప్రయత్నిస్తోంది.
టాలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది మృణాల్ ఠాకూర్. సీతా రామం, హాయ్ నాన్న వంటి చిత్రాలు విజయాలు సాధించడంతో మృణాల్‌కు తెలుగు చిత్రసీమ నుంచి ఛాన్సులొస్తున్నాయి. అయితే దక్షిణాదిన ఎన్ని అవకాశాలు ఉన్నా.. హిందీ చిత్రసీమలోను వెలిగేందుకు మృణాల్ ప్రయత్నిస్తోంది.
అదే సమయంలో మృణాల్ సోషల్ మీడియాల ద్వారా అందరికీ టచ్ లో ఉంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో యువతరం హృదయాల్లో నిలుస్తున్న ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వేడెక్కిస్తోంది. ఈ ఫోటోషూట్ లో మృణాల్ బ్లాక్ డ్రెస్ లో బాస్ లేడీ వైబ్స్ ని అందించింది.
నా లోపలి జెండాయా బయటపడుతోంది..! ఫ్యాషన్ ఐకాన్ జెండయా నుంచి ప్రేరణ పొందిన నా వార్డ్రోబ్ లో చిక్ లుక్ ఇది..#మయామీ ఫెస్టివల్ కోసం ఈ డబుల్ బ్రెస్ట్ జాకెట్ ని ధరించాను.. ఈ బాస్ బేబ్ వైబ్‌ని బతికించడంలో నాకు సహాయం చేసినందుకు తనిష్క్ మల్హోత్రాకి ప్రత్యేక ధన్యవాదాలు. 2012లో ఖామోషియాన్ చిత్రీకరణ సందర్భంగా నా మేకప్ ఆర్టిస్ట్ బహుమతిగా ఇచ్చిన స్కార్ఫ్ సెంటిమెంట్ టచ్‌ని జోడించింది అని తెలిపింది. . ఈ లుక్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది! మరిన్ని మరపురాని క్షణాలను సృష్టించడానికి వేచి ఉండలేను అని కూడా రాసింది. ప్రస్తుతం మృణాల్ లేటెస్ట్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ప్రస్తుతం ఈ భామ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. పూజా మేరీ జాన్, హే జవానీ తో ఇష్క్ హోనా హై అనే చిత్రాలు సహా తుమ్ హో తో.. సన్ ఆఫ్ సర్ధార్ 2లోను మృణాల్ నటిస్తోంది.