ప్రభాస్ సినిమా.. మృణాల్ సడన్ ట్విస్ట్

చారిత్రక నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో, కోల్కతా మరియు హైదరాబాద్ నేపథ్యం ఉంటుందట.

Update: 2024-08-14 10:10 GMT

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రబాస్‌ నటిస్తున్న తాజా సినిమాలపై విపరీతమైన గాసిప్స్ పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రబాస్ మరియు దర్శకుడు హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ గురించి కూడా పలు రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. "ఫౌజీ" అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

చారిత్రక నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో, కోల్కతా మరియు హైదరాబాద్ నేపథ్యం ఉంటుందట. సుభాస్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం వంటి అంశాలు కూడా ఉంటాయని రూమర్స్ వస్తున్నాయి. మొదట సెకండ్ వరల్డ్ వార్ పాయింట్ కూడా ఉంటుందని టాక్ వచ్చింది. ప్రబాస్‌ ఇలాంటి చారిత్రక కథా చిత్రం చేయడం అభిమానుల్లో ఎంతగానో ఆసక్తిని పెంచింది.

ఇక సినిమాలో నటించనున్న కథానాయిక విషయంలో కూడా చాలా రకాల వార్తలు వచ్చాయి. సీతారామం ఫేమ్ మృణాల ఠాగూర్ ఓకే అయినట్లు ఇప్పటికే ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపించింది. దర్శకుడు హను సీతారామం సినిమాలో ఆమెను చాలా అందంగా ఎమోషనల్ గా హైలెట్ చేశాడు. ఇక మరోసారి ప్రభాస్ కు జోడిగా చూపించే ప్రయత్నం చేయనున్నట్లు రకరకాల వార్తలు వచ్చాయి.

ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి అఫీషియల్ గా క్లారిటీ ఇస్తారని అనుకుంటున్న సమయంలో మృణాల్ బాంబ్ పేల్చింది. ఈ వార్తలు నిజం కాదని మృణాల్ థాకూర్ స్వయంగా స్పష్టతనిచ్చింది. తనపై వస్తున్న రూమర్లను ఖండిస్తూ, మృణాల్ థాకూర్ సోషల్ మీడియాలో తన స్పందన తెలియజేసింది. "SORRY TO BE A VIBE KILLER! BUTTTTT I'M NOT A PART OF THIS FILM." అంటూ మృణాల్, ఒక ఆర్టికల్‌ చూసిన వెంటనే తాను ఈ సినిమాలో భాగం కావడం లేదని ఖరారు చేసింది.

ఇది ఆమె అభిమానులకు కొంత నిరాశ కలిగించిన విషయం. ప్రభాస్ మృణాల్ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే అందంగా ఉంటుందని ఆమెనే సెలెక్ట్ చేసుకోవాలని ఓ వర్గం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మృణాల్ పేరు అసలు చర్చల్లోకి వచ్చిందా లేదా అనే విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక ఆమె చెప్పినాధాన్ని బట్టి సినిమాలో లేనని ఒక క్లారిటీ ఇచ్చేసింది. బహుశా మృణాల్ ని సంప్రదించి ఉండకపోవచ్చని తెలుస్తోంది

మృణాల్ థాకూర్ పాల్గొనడం లేదని స్పష్టమైన తర్వాత, ప్రస్తుతం చిత్ర యూనిట్‌ కొత్త కథానాయిక కోసం పరిశీలన జరుపుతుందనే సమాచారం అందుతోంది. త్వరలోనే చిత్ర నిర్మాతలు ఈ విషయంపై అఫీషియల్ గా ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ఇక ప్రబాస్‌-హను రాఘవపూడి కలయికలో వస్తున్న ఈ చారిత్రక చిత్రం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Tags:    

Similar News