పిక్ టాక్ : ఏంటి మేడం ఈ డ్రెస్‌?

ఆ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచింది.

Update: 2024-06-14 09:01 GMT

బాలీవుడ్‌ ప్రేక్షకులకు చాలా కాలం క్రితమే సీరియల్స్ మరియు సినిమాల ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. తెలుగు వారికి మాత్రం కొన్నాళ్ల క్రితం సీతారామం సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచింది.


సీతారామం సినిమా తర్వాత ఈ అమ్మడు హాయ్ నాన్న తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇటీవల వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ మాత్రం నిరాశ పరిచింది. ఆ సినిమా నిరాశ పరచినా కూడా మృణాల్‌ జోరు మాత్రం తగ్గలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పికాక్ అనే ప్రముఖ మ్యాగజైన్ కోసం కవర్ ఫోటో షూట్‌ ఇచ్చింది.

విభిన్నమైన ఔట్ ఫిట్‌ లో మృణాల్‌ ఆ కవర్‌ పై మెరిసింది. అయితే కొందరు మాత్రం ఇదేం డ్రెస్ అమ్మడు అంటూ పెదవి విరుస్తున్నారు. మరి కొందరు స్కిన్‌ సో చేయకుండా కవర్‌ పై ఫోజ్ ఇవ్వడం ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి మృణాల్‌ ఠాకూర్‌ ఈ కవర్ పేజీ ఫోటో వైరల్‌ అవుతుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. సౌత్‌ లో ఈ అమ్మడికి మరిన్ని మంచి ఆఫర్లు రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News