మ‌ల్టీప్లెక్స్ రంగానికి ఊహించ‌ని ముప్పు?

దిగి రాని టికెట్ ధరలు, కోలాలు చిరు తిళ్ల ధ‌ర‌లు కూడా ప్ర‌జ‌ల్ని భ‌య‌పెడుతున్నాయి. దీంతో ప్ర‌జ‌ల ఆలోచ‌న త‌క్కువ ఖ‌ర్చు వైపు మ‌ళ్లింది.

Update: 2024-12-03 04:03 GMT

మాల్స్ కి వెళ్లే జ‌నం త‌గ్గ‌డంతో దానికి కార‌ణాల‌ను అన్వేషిస్తున్నారు బిల్డ‌ర్లు. దానికి త‌గ్గ‌ట్టే ఇప్పుడు మార్పులు మొద‌ల‌య్యాయ‌ని విశ్లేష‌ణ‌. దేశంలోని మాల్స్ ట్రాఫిక్‌లో ప‌ది శాతంతో పోలిస్తే ఆరు శాతానికి త‌గ్గిపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దీనికి కార‌ణం మ‌ల్టీప్లెక్సుల్లో సినిమాలు చూసేందుకు ఎవ‌రూ ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అంత‌కంత‌కు పెరుగుతున్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల బెడ‌ద ఒక వైపు ఉంటే, పేలవమైన సినిమాల‌ను థియేట‌ర్ల‌లోకి తెస్తుండ‌డంతో అవి జ‌నాల‌కు న‌చ్చ‌డం లేద‌ని విశ్లేషిస్తున్నారు.

దిగి రాని టికెట్ ధరలు, కోలాలు చిరు తిళ్ల ధ‌ర‌లు కూడా ప్ర‌జ‌ల్ని భ‌య‌పెడుతున్నాయి. దీంతో ప్ర‌జ‌ల ఆలోచ‌న త‌క్కువ ఖ‌ర్చు వైపు మ‌ళ్లింది. కుటుంబం మొత్తానికి ఒకసారికి ఒక సినిమాకి పెట్టే డ‌బ్బుతో ఏడాది మొత్తం స‌రిప‌డే ఓటీటీ మెంబ‌ర్ షిప్ పొంద‌వ‌చ్చు. దీంతో ఇల్లు దాటి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండానే కొత్త సినిమాల‌ను ఓటీటీల్లో చూడొచ్చు... కొన్నాళ్లు ఆగితే చాలు! అనే ధోర‌ణి ప్ర‌బ‌లింది. కార‌ణం ఏదైనా కానీ ఓటీటీలు మాల్స్ పై బిగ్ పంచ్ వేస్తున్నాయ‌ని అంచ‌నా.

థియేట‌ర్ల నుంచి బాక్సాఫీస్ వసూళ్లు గ‌తేడాది రూ.13,161 కోట్ల నుండి ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.7,811.8 కోట్లకు పడిపోయాయి. ఆక్యుపెన్సీ రేట్లు కూడా మహమ్మారికి ముందు 30 శాతం ఉండ‌గా, ఇప్పుడు 25.8 శాతానికి పడిపోయాయి. ఇది క‌చ్ఛితంగా ఓటీటీల ఎదుగుద‌ల‌ను సూచిస్తూ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌కు అనాదార‌ణ గురించి నొక్కి చెబుతోంది.

కార‌ణం ఏదైనా కానీ మాల్స్ లో సినిమా స్పేస్ ని త‌గ్గించి ఆహారం, గేమింగ్, రిటైల్ వ్యాపారాలలో పెట్టుబడి పెడుతున్నారు. మల్టీప్లెక్స్‌లు మాల్ ఆపరేటర్‌లకు నిర్ణీత కనీస మొత్తాన్ని చెల్లిస్తాయి .. వ‌చ్చిన‌ ఆదాయాన్ని వాటాలు తీసుకుంటాయి. గ‌తేడాది తొమ్మిది నెలల కనీస హామీని పొందారు. ఈ సంవత్సరం కేవ‌లం నాలుగైదు నెలలకు మాత్రమే హామీ ఉందని స‌మాచారం.

Tags:    

Similar News