అనిరుధ్ - థమన్ వల్లే.. ఆ లెజెండ్స్ ఫెడౌట్!
అయితే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కారణంగా మరో ఇద్దరు స్టార్ మ్యూజిషియన్స్ అవకాశాలు కోల్పోయారు.
సినిమా ఇండస్ట్రీలో ప్రతి జనరేషన్ కి కొత్త టాలెంట్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ కాలం చేసే మాయలో కొంతమంది ఫేమ్ లో ఉన్న స్టార్స్ కాస్తా అవుట్ డేటెడ్ అయిపోతారు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన వారు తమ టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకుంటూ ఉంటారు. హీరో, హీరోయిన్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు ఇది అందరికి వర్తిస్తుంది. ప్రతి దశాబ్దానికి ఒకసారి ఆడియన్స్ టెస్ట్, ట్రెండ్ మారిపోతుంది.
అలాగే మ్యూజిక్ కి వచ్చేసరికి ఇటు టాలీవుడ్ తమన్, అటు కోలీవుడ్ లో అనిరుద్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలన్నింటికి ఈ ఇద్దరే ఎక్కువగా మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం. అలాగే రెమ్యునరేషన్ పరంగా అత్యధికంగా తీసుకుంటున్నవారు కూడా వీరే కావడం కావడం మరో ఇంటరెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కారణంగా మరో ఇద్దరు స్టార్ మ్యూజిషియన్స్ అవకాశాలు కోల్పోయారు.
తెలుగులో మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సక్సెస్ లతో దశాబ్దం పాటు చక్రం తిప్పారు. స్టార్ హీరోలు అందరూ కూడా మణిశర్మతోనే మ్యూజిక్ చేయించుకునేవారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కింగ్ గా మణిశర్మ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.
అతని సాంగ్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మెలోడీ బ్రహ్మ అనే అనే మరో బ్రాండ్ ఇమేజ్ కూడా మణిశర్మకి వచ్చింది. అయితే అతని దగ్గర చేసే తమన్ బయటకి వచ్చి సొంతంగా స్టార్ట్ చేయడం జరిగింది.
అప్పటికి తమన్ సంగీతం కొత్తగా ఉండటంతో ఇక స్టార్ హీరోలు అందరూ అతనికి క్యూ కట్టడం మొదలు పెట్టారు. దేవిశ్రీ ప్రసాద్, తమన్ పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఉండేవారు. వీరిద్దరి కారణంగా మణిశర్మకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ముఖ్యంగా మణిశర్మకి రావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా తమన్ కి వెళ్ళిపోతూ ఉండేవి. ఇప్పటికి ఏడాదికి 10 సినిమాల వరకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూ స్టార్ ఇమేజ్ ని కొనసాగిస్తున్నాడు.
ఇక తమిళంలో హరీష్ జయరాజ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవాడు. ఏ ఆర్ రెహమాన్ తర్వాత అంతగా అతనికి పాపులారిటీ వచ్చింది. అయితే అనిరుద్ ఎంట్రీతో హరీష్ జయరాజ్ ఫేట్ మారిపోయింది. రేసులో వెనక్కిపోయారు. అతని ప్లేస్ లోకి అనిరుద్ వచ్చేసి ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ బడ్జెట్ సినిమాలన్నీ అతనే చేస్తున్నాడు. ఇలా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కారణంగా మరో ఇద్దరు స్టార్ మ్యుజీషియన్స్ తన కెరియర్ ని కోల్పోవాల్సి వచ్చింది.