చుట్టమల్లే Vs నానా హైరానా.. రెండింటిలో ఏది బాగుందంటే?

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''గేమ్ ఛేంజర్''. 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2024-11-29 06:59 GMT

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''గేమ్ ఛేంజర్''. 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా గురువారం సినిమాలోని 'నానా హైరానా' అనే మూడో పాటని విడుదల చేశారు. ''ప్రియమైన హైరానా.. మొదలాయే నాలోనా లలనా నీ వలనా'' అంటూ సాగిన ఈ మెలోడీ గీతానికి ఎస్. థమన్ స్వరాలు సమకూర్చారు. సింగర్స్ శ్రేయా ఘోష‌ల్, కార్తీక్ కలిసి ఆలపించారు. ఈ పాటకి సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాట విడుదలైనప్పటి నుండి 'చుట్టమల్లే' తో కంపేరిజన్స్ మొదలయ్యాయి.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ''దేవర 1''. ఇందులో అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన 'చుట్టమల్లే' పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు నెలల క్రితం వచ్చిన ఈ సాంగ్ తెలుగు వెర్షన్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో 25 కోట్లకు పైగా వ్యూస్ రాబడితే, వీడియో సాంగ్ ఇప్పటికే 3 కోట్లకి పైగా వ్యూస్ సాధించింది. మ్యూజిక్ లవర్స్ ను అంతగా ఆకట్టుకున్న ఈ పాటకు, ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'నానా హైరానా' సాంగ్ మధ్య పోలికలు పెడుతున్నారు. రెండు మెలోడీ సాంగ్స్ లో ఏది బాగుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

'నానా హైరానా' & 'చుట్టమల్లే' సాంగ్స్ మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. రెండు రొమాంటిక్ మెలోడీ గీతాలకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. రెండు పాటలకు డ్యాన్స్ మాస్టర్ బాస్కో మార్టిస్ నే కొరియోగ్రఫీ చేసారు. 'గేమ్ ఛేంజర్' పాటను న్యూజిలాండ్ లో షూట్ చేస్తే, 'దేవర' సాంగ్ ను థాయిలాండ్ లోని కోహ్ హాంగ్ ఐలాండ్ లో చిత్రీకరించారు. అయితే 'నానా హైరానా' మెలోడీ ఆఫ్ ది ఇయర్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. 'చుట్టమల్లే'ని కొట్టే మెలోడీ రాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

నిజానికి మెలొడీ విషయంలో థమన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. హీరో ఎవరైనా, సినిమా ఏదైనా తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు 'నానా హైరానా' సాంగ్ తోనూ తన మ్యాజిక్ రిపీట్ చేసారు. అదే సమయంలో అనిరుధ్ కూడా మెలోడీ ట్యూన్స్ లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సినిమాలో సందర్భాన్ని బట్టి బ్యూటిఫుల్ మెలోడీలను కంపోజ్ చేస్తూ ప్రశంసలు అందుకుంటూ వస్తున్నారు. ఆ విధంగానే 'చుట్టమల్లే' పాటతో అందరినీ ఆకట్టుకున్నారు. థియేటర్లలో ప్రేక్షకులు 'ఆహ్' సౌండ్ తో రచ్చ చేశారంటేనే ఈ పాట ఎంతగా రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

'చుట్టమల్లే' పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుందో.. 'నానా హైరానా' సాంగ్ లో రామ్ చరణ్, కియారా అద్వానీల కెమిస్ట్రీ కూడా అంతే బాగుంది. రెండు పాటల్లోనూ సింపుల్ స్టెప్పులు ఆకట్టుకున్నాయి. సింగర్ వాయిసెస్ కూడా ఈ పాటలకు స్పెషల్ అట్రాక్షన్‌ తీసుకొచ్చాయి. కాకపోతే 'నానా హైరానా' పాట శంకర్ మార్క్ విజువల్స్ తో కాస్త గ్రాండియర్ గా ఉంది. ఈ పాటను ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీక‌రించారు. ఖర్చు కూడా భారీగానే పెట్టారని తెలుస్తోంది. కానీ అంత ఎక్కువ ఖర్చు చేయకుండానే 'చుట్టమల్లే' పాటలో మంచి విజువల్స్ అందించారు.

ఇక సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా ఎన్టీఆర్ 'చుట్టమల్లే'లో రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తే.. 'నానా హైరానా' పాటలో రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు. ఇద్దరూ తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో, స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అక్కడ జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఇక్కడ కియారా అద్వానీ అందంగా కనిపించింది కానీ, జాన్వీ మాదిరిగా ఎక్స్‌పోజింగ్ చేయలేదు.. రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేదు. ఇప్పటికైతే 'నానా హైరానా' లిరికల్ వీడియో మాత్రమే వచ్చింది కాబట్టి, విజువల్ గా 'చుట్టమల్లే' పాటతో కంపేర్ చేయడం సరికాదు. మెలోడీ ట్యూన్స్ పరంగా అయితే థమన్, అనిరుధ్ ఇద్దరూ తమ బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. సో రెండు పాటల మధ్య పోలికలు పెట్టకుండా, మ్యూజిక్ లవర్స్ రెండిటినీ ఎంజాయ్ చేస్తారని భావించవచ్చు.

Tags:    

Similar News