'నా సామిరంగ'.. నాగ్ రంగంలోకి దిగాల్సిందే..
కింగ్ నాగార్జున గత కొద్ది సంవత్సరాలుగా ప్రతీ సంక్రాంతికి కచ్చితంగా తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు
కింగ్ నాగార్జున గత కొద్ది సంవత్సరాలుగా ప్రతీ సంక్రాంతికి కచ్చితంగా తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈసారి కూడా అదే ప్లాన్ తో 'నా సామి రంగ' షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రతి సంక్రాంతికి ఓ బ్లాక్ బస్టర్ ని తన అభిమానులకు ఇవ్వాలని డిసైడ్ అయిన ఈ సీనియర్ హీరో తన సినిమా రిలీజ్ ని సంక్రాంతి నుండి వేరే డేట్ కి మార్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న 'నా సామి రంగ' మూవీ అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి ప్రధాన తారాగణంతో ఓ మాస్ కమర్షియల్ ప్యాకేజీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అనుకున్న టైం కి షూటింగ్ పూర్తి చేసేందుకు మూవీ టీం చాలా కష్టపడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకి తాజాగా ఓ పెద్ద సమస్య వచ్చిపడింది. అదేంటంటే, 'నా సామిరంగ' మూవీకి సరిపడా థియేటర్స్ దొరకడం లేదట. C, D సెంటర్లలో ఇప్పటికే ఇతర సినిమాల కోసం అన్ని థియేటర్స్ లాక్ చేయబడ్డాయి. అటు A,B సెంటర్స్ లో కూడా పెద్దగా థియేటర్స్ దొరకడం లేదని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నాగార్జున ఈ విషయాన్ని తాజాగా నిర్మాతలకు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో రంగంలోకి దిగిన ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సమస్యను పరిష్కరించేందుకు అలాగే రిలీజ్ డేట్ ప్లానింగ్ గురించి చర్చలు జరిపేందుకు సమావేశం అవుతున్నట్లు తెలిసింది. మరి ఈ సమావేశంలో చర్చలు సఫలమై నాగార్జున నా సామి రంగ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయేమో చూడాలి. కాగా సంక్రాంతి బరిలో 'నా సామి రంగ' తో పాటు 'గుంటూరు కారం', 'సైంధవ్', 'ఈగల్', 'హనుమాన్' వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇక నా సామిరంగ సినిమా విషయానికొస్తే.. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమాలో నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.