యాక్సిడెంట్ తర్వాత వర్కవుట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నా
2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది
2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కు జోడీగా ఇస్మార్ట్ శంకర్ లో నటించి మంచి బ్రేక్ అందుకున్న నభా కెరీర్ కు ఇక తిరుగులేదనుకున్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డార్లింగ్ సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరోటి ప్లాపులుగా నిలిచాయి.
అయితే మధ్యలో అమ్మడు ఓ ఏడాది పాటూ ఏ సినిమాలోనూ కనిపించలేదు. దానికి కారణం ఆమె యాక్సిడెంట్ కు గురై తీవ్ర గాయాలపాలైంది. ఆ టైమ్ లో నభాకు కొన్ని సర్జరీలు కూడా జరిగాయి. ఆ యాక్సిడెంట్ వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో బాధను అనుభవించానని నభా ఇప్పటికే పలుమార్లు చెప్పింది.
తనకు మూడేళ్ల కింద జరిగిన ప్రమాదంలో భుజం గాయపడి కొన్ని సర్జరీలు చేశారని, ఆ టైమ్‌లో తన ఫిట్‌నెస్ ను తిరిగి పొందడానికి తానెంతో శ్రమించినట్టు నభా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నభా ప్రస్తుతం నటిస్తున్న రెండు యాక్షన్ సినిమాలు ఈ ఇయర్ లోనే రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాల కోసం నభా తాను స్ట్రెంగ్త్ ను బిల్డ్ చేసుకుంటున్నట్టు తెలిపింది.
యాక్సిడెంట్ లో అయిన గాయాల వల్ల వర్కవుట్స్ చేయడాన్ని తానెంతో ఎంజాయ్ చేస్తున్నానని, దాని వల్ల శరీరంపై అవగాహన పెరిగిందని.. మొబిలిటీ ఎక్సర్సైజ్‌లు, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ చేయడాన్ని ఇష్టపడుతున్నానని, అంతకు ముందు నటిగా ఉన్నప్పుడు తప్పదు కాబట్టి వర్కవుట్స్ చేయాలి కాబట్టి చేసేదాన్నని, కానీ ఇప్పుడు వర్కవుట్స్ విషయంలో తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని వెల్లడించింది నభా.
డైట్ లో భాగంగా తాను ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకుంటానని, ఎగ్స్, చికెన్ లేదా చేపలతో వెజిటెబుల్స్, రైస్ లేదా రోటీ తీసుకుంటానని, జంక్ ఫుడ్ ను పూర్తిగా కంట్రోల్ చేశానని చెప్తుంది నభా. ఇక సినిమాల విషయనికొస్తే నిఖిల్ తో కలిసి స్వయంభు అనే పాన్ ఇండియా సినిమాతో పాటూ నాగబంధం అనే సినిమాను కూడా చేస్తోంది నభా.