ఫ్యాన్స్ తో కలిసి తాతగారి సినిమా కి చైతూ...!

ఏయన్నార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో భాగంగా హైదరాబాద్ శాంతి థియేటర్ లో క్లాసిక్‌ మూవీ ప్రేమ్‌ నగర్‌ ను నాగ చైతన్య చూశాడు.

Update: 2024-09-22 09:32 GMT

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్‌ పేరుతో ఫిల్మ్‌ ఫెస్టివల్ ను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఏయన్నార్ నటించిన పది సూపర్‌ హిట్‌ క్లాసిక్ మూవీస్ ను హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో సైతం స్క్రీనింగ్ చేస్తున్నారు. మొత్తం 25 నగరాలు, పట్టణాల్లో ఏయన్నార్‌ క్లాసిక్ మూవీస్ స్క్రీనింగ్‌ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలను ఫ్యాన్స్ కోసం ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది.

ఏయన్నార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో భాగంగా హైదరాబాద్ శాంతి థియేటర్ లో క్లాసిక్‌ మూవీ ప్రేమ్‌ నగర్‌ ను నాగ చైతన్య చూశాడు. అభిమానులతో కలిసి ఉర్రూతలూగుతూ థియేటర్‌ లో కోలాహలం మధ్య సినిమాను చైతూ ఫ్యాన్స్ తో పాటు ఎంజాయ్ చేయడం జరిగింది. తాత గారి సినిమాను ఒక సామాన్య ప్రేక్షకుడిగా నాగ చైతన్య సినిమా చూడటం అందరి దృష్టిని ఆకర్షించింది. 20వ తారీకు మొదలైన ఫిల్మ్‌ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. నేడు అత్యధికంగా ఏయన్నార్‌ ఫ్యాన్స్ సినిమాలను చూసేందుకు థియేటర్లకు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నాగ చైతన్య శాంతి థియేటర్ లో ఫ్యాన్స్ తో కొద్ది సమయం చిట్‌ చాట్ చేయడంతో పాటు, వారితో కలిసి తాత గారి సినిమాను ఎంజాయ్‌ చేశాడు. ఆ సమయంలో ఫ్యాన్స్ తో ఫోటోలు దిగాడు. ప్రస్తుతం చైతూ తండేల్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సాయి పల్లవి ఆ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తూ ఉండగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విడుదల తేదీ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఏయన్నార్‌ శత జయంతి సందర్భంగా ప్రేక్షకులముందుకు ప్రేమ్‌ నగర్‌ సినిమాతో పాటు, దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్‌, భార్య భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్‌ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమాభిషేకం, మనం సినిమాలు స్క్రీనింగ్‌ చేయడం జరిగింది. ఫ్యాన్స్ సమక్షంలో భారీ ఎత్తున వేడుకలా ఏయన్నార్‌ శతజయంతి ఉత్సవం జరిగిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే నాగార్జున మాట్లాడుతూ మెగాస్టార్‌ చిరంజీవికి ఏయన్నార్ జాతీయ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. వచ్చే నెలలో చిరంజీవికి బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ చేతుల మీదుగా ఏయన్నార్‌ అవార్డును ఇవ్వబోతున్నారు.

Tags:    

Similar News