టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి.. ఇంత ఓపెన్ గానా..?
ముఖ్యంగా రష్మిక టాలీవుడ్ యువ హీరోతో ప్రేమలో ఉంది అన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఓ పక్క వరుస సూపర్ హిట్లతో ఒక రేంజ్ ఫాం కొనసాగిస్తుంది. రష్మిక సినిమా వస్తుంది అంటే చాలు యూత్ అంతా కూడా సినిమా చూసేందుకు ఎగబడేలా చేసుకుంది. అంతేకాదు కమర్షియల్ సినిమాలతో పాటు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు కూడా రష్మిక స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది. యానిమల్ తర్వాత పుష్ప 2 తో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక రాబోతున్న సినిమాలతో కూడా తన సత్తా చాటబోతుంది.
ఐతే రష్మిక మందన్న ప్రొఫెషనల్ లైఫ్ యమ జోరుగా సాగిపోతుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. సెట్స్ మీద 3, 4 సినిమాలు ఉండగా లైన్ లో మరో రెండు ఉన్నాయి. ఐతే ఈ సినిమాలు వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే రష్మిక పర్సనల్ లైఫ్ గురించి కూడా మీడియా స్పెషల్ అటెన్షన్ చూపిస్తుంది. ముఖ్యంగా రష్మిక టాలీవుడ్ యువ హీరోతో ప్రేమలో ఉంది అన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది.
వాళ్లిద్దరు ఓకే అవ్వలేదు కానీ దాదాపు వారితో పనిచేస్తున్న వారంతా కూడా ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రష్మిక పెళ్లి పై టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా కామెంట్ చేశారు. లేటెస్ట్ గా డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి వెళ్లిన నాగ వంశీ ఈ షోలో రష్మిక ప్రస్థావన రాగానే టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి అంటూ చెప్పాడు. ఐతే ఆ హీరో ఎవరన్నది మాత్రం తెలియదని అన్నాడు.
అది ఎవరని తెలిసినా అతను చెప్పడం కుదరదు అది వేరే విషయం. కానీ రష్మిక గురించి ఆమెతో పనిచేసే ఒక నిర్మాత ఇలా డైరెక్ట్ గా పెళ్లి గురించి చెప్పడం చూస్తుంటే ఏదో ఒకరోజు సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని వీళ్లు షాక్ ఇచ్చేలా ఉన్నారని అనిపిస్తుంది. రష్మిక డేటింగ్ లో ఉన్న ఆ హీరో ఎవరన్నది ఇప్పటికే అందరికీ తెలిసినా ఎవరు కూడా అతని పేరు చెప్పట్లేదు. వాళ్లిద్దరు కూడా ప్రేమ పెళ్లి అనగానే తూచ్ మాకేమి తెలియదు అన్నట్టుగా ప్రవరిస్తుంటారు. మరి రష్మిక పెళ్లిపై నాగ వంశీ చేసిన కామెంట్స్ పై ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.