నా సామిరంగ కథ నాగార్జునదా?
కానీ ఈ కథ ఆయనది కాదట. ఈ కథని ఇచ్చింది నాగార్జున అట. విజయ్ బిన్ని..నాగార్జునకు స్టోరీ చెప్పడానికి వెళ్తే.. నా దగ్గర కథ ఉంది..దాన్ని డైరెక్ట్ చేయ్ అని ఆ స్టోరీని ఇచ్చారుట.
కింగ్ నాగార్జున స్టోరీ రైటర్ గా కూడా మారారా? ఆయన తాజా చిత్రం స్టోరీ ఆయనదేనా? అంటే అవుననే సందేహం రావడం ఖాయం. ప్రస్తుతం నాగార్జున కథానాయుడిగా కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నా సామిరంగ' చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమాతో విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం కావడంతో స్టోరీ కూడా ఆయనదే అనుకోవడం సహజం.
ఓ కొత్త మేకర్ వస్తున్నాడంటే? కచ్చితంగా సొంత స్టోరీతోనే వస్తాడు కాబట్టి! ఆ కోణంలో విజయ్ తను రాసుకున్న కథతోనే కింగ్ ని డైరెక్ట్ చేస్తున్నారనుకున్నారంతా. కానీ ఈ కథ ఆయనది కాదట. ఈ కథని ఇచ్చింది నాగార్జున అట. విజయ్ బిన్ని..నాగార్జునకు స్టోరీ చెప్పడానికి వెళ్తే.. నా దగ్గర కథ ఉంది..దాన్ని డైరెక్ట్ చేయ్ అని ఆ స్టోరీని ఇచ్చారుట. దాన్ని తనదైన శైలిఓల మార్పులు...చేర్పులు చేసి నా సామిరంగని పట్టాలెక్కించినట్లు విజయ్ తెలిపాడు.
అయితే ఈ స్టోరీ నాగార్జునకు ఎలా వచ్చింది? అన్నది సస్పెన్స్. ఆయనే రాసేసారా? లేక ఇతర రచయితల దగ్గర నుంచి కొని పెట్టిన స్టోరీని విజయ్ కి ఇచ్చారా? అన్నది తెలియాలి. 'నా సామిరంగ' 1980-90 కాలం మధ్యలో జరిగే స్టోరీ అట. చూడటానికి యాక్షన్ ప్రాధాన్యమున్న చిత్రంలా ఉన్నా ప్రధానంగా స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతోందిట. ఇందులో నాగార్జున పాత్రని చాలా కొత్తగా చూపించినట్లు తెలిపారు.
దర్శకుడిగా తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. తొలుత విజయ్ దర్శకుడు అవ్వాలనే సినిమా రంగంలోకి వచ్చారుట. కానీ 'నువ్వొస్తానంటే నేనొదంటానా' సినిమా చూసిన తర్వాత కొరియో గ్రాఫర్ గా చేస్తే అన్ని శాఖలపై పట్టు వస్తుందని అటువైపుగా వెళ్లినట్లు తెలిపారు. కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరో వైపు సినిమా దర్శకత్వం వైపు ప్రయత్నాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. చివరిగా నాగార్జున అవకాశం ఇవ్వడంతో దర్శకుడిగా మారుతున్నట్లు తెలుస్తోంది.