కూలీ.. నాగార్జున డీల్ ఎంత?
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా కూడా తెరకెక్కుతోందనే ప్రచారం నడిచింది. లోకేష్ ఖైది సినిమాతో మాఫియా కథల ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశారు. ఇందులో ఇప్పటికే విక్రమ్, లియో సినిమాలు వచ్చాయి. అయితే కూలీ లోకేష్ మాఫియా కథల ఫ్రాంచైజ్ లో భాగం కాదంట. దీనిని కంప్లీట్ గా కొత్త కథ, కథనంతో లోకేష్ చేస్తున్నారంట.
ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి క్యాస్టింగ్ ని తీసుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని చేయనున్న నేపథ్యంలో భారీ మల్టీస్టారర్ చిత్రంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి హాసన్, సత్యరాజ్, కోలీవుడ్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలలో నటించబోతున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యారు.
నాగార్జున బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి విషెస్ తెలియజేసింది. కూలీ మూవీలో నాగార్జున సైమన్ అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు రివీల్ చేశారు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కింగ్ నాగార్జున రెమ్యునరేషన్ గురించి ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది.
మూవీలో కింగ్ నాగార్జున ప్రతినాయకుడిగా నటిస్తున్నాడని, ఆ క్యారెక్టర్ కోసం ఏకంగా 24 కోట్ల రెమ్యునరేషన్ ని ఇస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. నాగార్జున కెరియర్ లో అత్యధికంగా 18 కోట్ల వరకు గతంలో తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. కానీ కూలీ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. సినిమాలో అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందంట.
ఈ కారణంగానే 24 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. నిజంగా ఆ స్థాయిలో నాగార్జున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటే మాత్రం కచ్చితంగా అది రికార్డ్ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుభేర సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత కూలీ మూవీ రానుంది. ఈ ఏడాది నాగ్ నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సోలోగా కొత్త సినిమా అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు.