మెగాస్టార్ తో కింగ్.. ఈ కాంబోలో సినిమా పడితే..
వయస్సు పెరుగుతున్న కొద్ది వీరి అందం కూడా మరింత పెరిగిపోతోంది.
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ప్రస్తుతం సీనియర్ హీరోల కేటగిరీలో టాప్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్. వీరిద్దరూ లుక్స్ పరంగా, ఫిజికల్ మెయింటెనెన్స్ పరంగా యంగ్ స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్ది వీరి అందం కూడా మరింత పెరిగిపోతోంది. వయసులో ఇద్దరు 60+ దాటిన కూడా అదే గ్రేస్, అదే స్మార్ట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి మరల నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతకాలం లుక్స్ పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో అదిరిపోయే లుక్ లో, ఒకప్పటి గ్రేస్ ని పెర్ఫామెన్స్ లో చూపిస్తూ అందరిని అలరించారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ అయిపోయింది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు.
కానీ ‘ గేమ్ చేంజర్’ కోసం తప్పుకున్నారు. 2025 మే 9న ఈ చిత్రం థియేటర్ లలోకి రాబోతోంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కింగ్ నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని ఏఎన్నార్ నేషనల్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. ఇక ఈ అవార్డుల వేడుక కోసం కింగ్ నాగార్జున తాజాగా చిరంజీవిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి ఫోటోలకి ఫోజులిచ్చారు.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరు హ్యాండ్సమ్ లుక్ లో ఈ ఫోటోలలో మెరిసిపోతూ ఉండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవి టీ షర్ట్ వేసుకుని, కింగ్ నాగార్జున కలర్ ఫుల్ షార్ట్, కార్లింగ్ హెయిర్, స్టైలిష్ గడ్డంతో చాలా మోడ్రన్ గా కనిపిస్తున్నారు. ఫోటోలలో ఇద్దరిని చూస్తుంటే యంగ్ హీరోల మాదిరిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది.
అభిమానులు కూడా అలాగే కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ ఒకే సినిమాలో స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరావు 100వ జయంతి సెలబ్రేషన్స్ త్వరలో జరగబోతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా అమితాబ్ బచ్చన్ రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుని చిరంజీవి స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది.