చైతన్య-శోభిత పెళ్లి ప్లానింగ్ వాళ్లకే వదిలేసాం!
తాజాగా ఈ విషయాన్ని కింగ్ నాగార్జున కన్పమ్ చేసారు. `చైతన్య-శోభిత పెళ్లి సింపుల్ గా జరుగుతుంది.
నాగ చైతన్య-శోభిత ల వివాహానికి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4 నవివాహం జరుగుతుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా నెట్టింట వైరల్ అయింది. అతిధులందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. అయితే ఈ వివాహం సింపుల్ గా జరుగుతుందని మొదటి నుంచి అంతా అనుకుంటున్నదే. తాజాగా ఈ విషయాన్ని కింగ్ నాగార్జున కన్పమ్ చేసారు. `చైతన్య-శోభిత పెళ్లి సింపుల్ గా జరుగుతుంది.
పెద్దగా హడావుడి ఏం ఉండదు. దీనికి సంబంధించి 300-400 మధ్య కుటుంబ సభ్యులు, బంధువులు, ఇండస్ట్రీ సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించాం. వారిద్దరు సింపుల్ వెడ్డింగ్ కోరుకోవడంతోనే ఏర్పాట్లను కూడా వాళ్లకే వదిలేసాం` అన్నారు. దీంతో వివాహం పెద్దగా హడావుడి లేకుండా నిరాడంబరంగా జరుగుతుందని తెలుస్తుంది. సమంత తో విడిపోయిన తర్వాత నాగచైన్య శోభితకు దగ్గరయ్యాడు. కొంత కాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు.
పలు సందర్భాల్లో రెస్టారెంట్లలోనూ...విదేశీ వెకేషన్లలోనూ కనిపించారు. అయితే ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు మాత్రం ఏ నాడు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కొన్ని రోజులకి పెద్దల సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకుని సర్ ప్రైజ్ చేసారు. అప్పటి నుంచి వివాహానికి కొన్ని నెలలు సమయం తీసుకున్నారు. చివరిగా డిసెంబర్ 4న పెళ్లికి ముహూర్తం పెట్టారు.
తొలుత ఈ వివాహం రాజాస్తాన్ లో జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. హైదరాబాద్ లోని తమ సొంత స్టూడియో...తాతయ్య ఏఎన్నార్ నిర్మాణం చేసిన అన్న పూర్ణ స్టూయోడిలోనే శోభిత మెడలో మూడు మూళ్లు... ఏడు అడుగులు వేసి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు.