కూలి.. నాగార్జున పవర్ఫుల్ లుక్ వచ్చేసింది

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, సహా నటీనటులు, దర్శకులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సర్వత్రా శుభాకాంక్షలు తెలుపుతున్నారు

Update: 2024-08-29 12:35 GMT

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, సహా నటీనటులు, దర్శకులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సర్వత్రా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ సందర్భంగా నాగార్జున నటిస్తున్న సినిమాల నుంచి అప్‌డేట్‌లు కూడా విడుదల అవుతూ ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘కుబేర’ చిత్రానికి సంబంధించి కింగ్ నాగార్జున కొత్త పోస్టర్‌ను విడుదల చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు.

అందులో నాగార్జున ఒక నిజాయితీ గలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న 'కూలీ' సినిమా నుండి నాగార్జున లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కింగ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.

ఆ వార్తలను నిజం చేస్తూ, నాగార్జున లుక్ విడుదల కావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. 'కూలీ' సినిమా పోస్టర్‌లో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలో ఆయన ఒక పవర్ఫుల్ డాన్ గా రజనీకాంత్‌కి సమానంగా నిలబడతారని సమాచారం. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాగార్జున బాలీవుడ్‌లో విలన్ పాత్రలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరలా విలన్ పాత్రలో కనిపించనున్నందున ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్‌పై కనిపించడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు.

'కూలీ' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా, అనిరుధ్ సంగీతం అందించడం, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్, నాగార్జున ఇద్దరి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై కనువిందు చేయనుందనే ఉత్సాహం అభిమానులలో నెలకొంది. ఇదివరకే నాగార్జున ఎన్నో గెస్ట్ రోల్స్ చేశాడు. ఇక ఇప్పుడు రజినీకాంత్ తో చేయడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ టీజర్ తో లోకేష్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. చూస్తుంటే గత సినిమాల కంటే గ్రాండ్ గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నాగార్జున క్యారెక్టర్ కు సంబంధించిన ఒక టీజర్ కూడా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.

Tags:    

Similar News