రంగంలోకి నాగ్.. సైమన్ గా ఛార్జ్!

రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీలోని కీలక పాత్ర కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-09-10 16:02 GMT

టాలీవుడ్ కింగ్ నాగార్జున.. తనదైన శైలిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వేరే హీరోల చిత్రాల్లో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే నాగ్ కు సంబంధించిన పోస్టర్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీలోని కీలక పాత్ర కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ మూవీలో నాగార్జున.. సైమన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని నాగ్ బర్త్ డే రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో నాగార్జున పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఒక చేతికి గోల్డెన్ కలర్ వాచ్ పెట్టుకుని సీరియస్ గా ఉన్నారు. మరో చేతిలో రెడ్ కలర్ స్కార్ఫ్ తో ఇంట్రెస్ట్ పెంచారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత నాగ్ రగ్డ్ లుక్ కొత్తగా అనిపిస్తుంది.

అయితే నాగార్జున.. ఇప్పుడు కూలీ మూవీ కోసం రంగంలోకి దిగారు. రీసెంట్ గా సెట్స్ లో జాయిన్ అయ్యారు. 40 రోజుల పాటు సాగనున్న కొత్త షెడ్యూల్ ఇటీవల వైజాగ్ లో స్టార్ట్ అయింది. ఇప్పుడు నాగార్జున కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మేకర్స్.. రజనీకాంత్‌, నాగ్ పై కొన్ని కీలకమైన సీన్లను షూట్ చేయనున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైమన్ ఆన్ ఛార్జ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక కూలీ మూవీలో నాగ్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు గాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన కెరీర్ లో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత ఉందో మాత్రం తెలియదు.

అయితే గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ డ్రామాగా కూలీ మూవీని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి కూలీ ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News