కింగ్ టార్గెట్ మిస్ అవ్వకూడదని..!

ఇంతకీ నాగ్ నెక్స్ట్ చేయబోయే సినిమాకు డైరెక్టర్ ఎవరు అంటే అది మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదని తెలుస్తుంది.

Update: 2024-03-22 11:30 GMT

ఈ సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో హిట్ అందుకున్న నాగార్జున ఫెస్టివల్ టైం లో ఫ్యామిలీ అంతా కూడా చూసే సినిమాతో వస్తే తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారని తెలుసుకున్నాడు. అందుకే నా సామిరంగ సక్సెస్ ఈవెంట్ లో మళ్లీ సంక్రాంతికి కలుద్దామని అన్నాడు. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో నటిస్తున్నాడు. ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో తన పోర్షన్ ని త్వరగా పూర్తి చేసి తన సోలో సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు నాగార్జున.

ఇంతకీ నాగ్ నెక్స్ట్ చేయబోయే సినిమాకు డైరెక్టర్ ఎవరు అంటే అది మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదని తెలుస్తుంది. ప్రస్తుతం కథల వేటలో ఉన్న నాగార్జున మరోసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావాలని చూస్తున్నాడు. నా సామిరంగ కేవలం 3 నెలల్లో పూర్తి చేసి రిలీజ్ చేశారు. కానీ నెక్స్ట్ సినిమా అలా కాకుండా జూన్, జూలై అలా మొదలు పెట్టి 2025 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ పెట్టేలా చూస్తున్నారట. ఏం చేసినా ఎలా చేసినా ఫెస్టివల్ టార్గెట్ మిస్ అవ్వకూడదని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చి హిట్ అందుకున్నాయి. నా సామిరంగతో సంక్రాంతి హిట్ సెంటిమెంట్ గా మార్చుకున్నాడు మన కింగ్. అందుకే ఇక తన సినిమా ఒకటి సంక్రాంతికి రిలీజ్ లాక్ చేసుకునే ప్లాన్ చేశాడు. సినిమా కన్ఫర్మ్ అవ్వకుండానే నెక్స్ట్ సంక్రాంతికి నేను ఫిక్స్ అని చెప్పాడు.

ఒకవేళ ధనుష్ తో చేస్తున్న కుబేర సినిమా సంక్రాంతికి వస్తే మాత్రం నాగార్జున తన సినిమాకు తను పోటీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇదిలాఉంటే నా సామిరంగ తో తనకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లోనే నాగార్జున నెక్స్ట్ సినిమా ఉంటుందని టాక్. మరోపక్క కోలీవుడ్ డైరెక్టర్స్ తో కూడా నాగార్జున చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. మరి వీరిలో ఎవరితో నాగార్జున సినిమా కన్ ఫర్మ్ అవుతుంది అన్నది చూడాలి. నా సామిరంగ హిట్ తో జోష్ లో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News