దర్శన్ కు మద్దతుగా టాలీవుడ్ హీరో.. ఇదెక్కడి ట్విస్ట్ బాబు?

ఈ కేసులో ఆధారాలు బలంగా ఉండటంతో పోలీసులు దర్యాప్తును కఠినతరం చేశారు.

Update: 2024-06-28 06:19 GMT

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన రేణుక స్వామి హత్య కేసులో రోజుకో వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. నిందితుడిగా ఉన్న దర్శన్ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే హత్య వ్యవహారం లో అతని పాత్ర బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆధారాలు బలంగా ఉండటంతో పోలీసులు దర్యాప్తును కఠినతరం చేశారు. ఇక కన్నడ ఇండస్ట్రీలో నే కాకుండా మిగతా సినిమా పరిశ్రమలలో సహనటులు, నటీనటులు కూడా తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అనే మాటలు చెబుతున్నారు.

అయితే, టాలీవుడ్ నటుడు నాగ శౌర్య మాత్రం ఈ వివాదాస్పద పరిస్థితుల్లో దర్శన్ కు మద్దతు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన సందేశం పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అతని నుంచి ఇలాంటి రియాక్షన్ అసలు ఎవరు ఊహించలేదు. నాగ శౌర్య ఈ సమయంలో తన స్నేహితుడిని సపోర్ట్ చేయడం తగదని అభిమానులు, పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

దర్శన్ తాను డబ్బు ఇచ్చి ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడని, హత్య ప్రదేశంలో అతని కారు సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపించినట్లు సమాచారం వస్తోంది. ఇలాంటి సమయంలో, రేణుకస్వామి హత్య తర్వాత తీసిన ఫోటోలు, ఆధారాలు చూస్తే ఎవరికైనా ఈ హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలి అనిపించడం సహజం. కన్నడ వారికంటే ఎక్కువగా తెలుగు వారు సదరు హీరోపై ఎక్కువగా ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నాగ శౌర్య దర్శన్ కు ఈ సమయంలో మద్దతు తెలుపడం వలన లేనిపోని ప్రతికూలతను కలిగించవచ్చు. ఈ కేసు కళ్లముందు ఇన్ని ప్రూఫ్స్ ఉండగా "ఐ స్టాండ్ విత్ దర్శన్" అని చెప్పడం అనవసరమైన నెగటివిటీకి దారి తీసింది అనేలా కామెంట్స్ వస్తున్నాయి. అసలే నాగ శౌర్య మార్కెట్ కూడా డౌన్ లో ఉంది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడం వలన తన భవిష్యత్తు కోసం కొత్త ప్రాజెక్టులను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

ఇక ఇలాంటి సమయంలో, దర్శన్ ఉదంతంతో మరింత నెగటివిటీకి లోనవుతుండడం అనవసరమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దర్శన్ నిర్దోషిగా బయట పడితే ఆ సమయాన కోర్టు తీర్పు అనంతరం మద్దతు తెలపడం మంచిదే కానీ కేసు విషయంలో ఇప్పుడే ఇలా చేయడం సరికాదని స్వంత అభిమానులే విమర్శిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం సాండల్ వుడ్ మీడియా లోనే కాదు, సోషల్ మీడియా వేదికల్లో కూడా పెద్ద చర్చకు దారి తీసింది.

గతంలో నాగశౌర్య దర్శన్ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వారి మధ్యలో ఎలాంటి అనుబంధం ఉందొ గాని నాగశౌర్య ఇలాంటి టైమ్ లో అది కూడా హత్యాకేసు విషయంలో రియాక్ట్ అవ్వడం చాలా రిస్క్ అనే కామెంట్స్ వస్తున్నాయి. దర్శన్ పై అభియోగాలు నాటికి మిత్రుడిగా మద్దతు తెలుపడం ఒక నాయుకత్వ లక్షణం అయినా, దీనివల్ల నాగ శౌర్య మరింత ప్రతికూల పబ్లిసిటీకి గురవుతాడని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అంతే కాకుండా, ప్రస్తుతం నాగ శౌర్య కెరీర్ లోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంలో మౌనంగా ఉండడం మేలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ఈ వివాదం మరింత ముదిరి, శౌర్యకు నష్టాన్ని కలిగించకముందే తన నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిదని మరికొందరు అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ స్థాయిలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కు శౌర్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News