కల్కి2898ఏడీ… అశ్వద్ధామ ఉన్న నిజమైన ఆలయం ఇదే

వీకెండ్ అయ్యేలోపు కల్కి మూవీ 500+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని భావిస్తున్నారు.

Update: 2024-06-29 06:06 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ ని కల్కి 2898ఏడీ మూవీ ఇచ్చేలా ఉంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ 330+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొదటి రోజు 190+ కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ఎనౌన్స్ చేసింది. రెండో రోజు 140+ కోట్లు కలెక్షన్స్ రాబట్టి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్ అయ్యేలోపు కల్కి మూవీ 500+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో అశ్వద్ధామ పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించారు. ఓ విధంగా చెప్పాలంటే కల్కి 2898ఏడీలో భైరవ పాత్ర కంటే అశ్వద్ధామ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. గత కొన్నేళ్లలో అమితాబ్ బచ్చన్ కి ఈ స్థాయి పాత్ర పడలేదనే మాట బాలీవుడ్ లో వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మైథాలజీ కాన్సెప్ట్ తో ఎడాప్ట్ చేసుకొని ఫ్యూచరిస్టిక్ మూవీగా నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ చిత్రాన్ని ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెప్పని చాలా ప్రశ్నలకి పార్ట్ 2లో నాగ్ అశ్విన్ సమాధానం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. అయితే ఇది మూడేళ్ళ తర్వాత వస్తుందని నాగ్ ఇప్పటికే చెప్పాడు. కల్కి మూవీలో అశ్వద్ధామ పాత్రని ఒక శివాలయంలో రివీల్ చేశారు. పాడుబడ్డ శివాలయం లోపల తపస్సు చేసుకుంటున్నట్లు అశ్వద్ధామ ఇంట్రడక్షన్ ఉంటుంది. అయితే ఈ సీన్ కోసం రియల్ టెంపుల్ షార్ట్ ని బయటికి నాగ్ అశ్విన్ చూపించారు.

నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లాపురంలో పెన్నానది ఒడ్డున ఈ శివాలయం ఉంది. 300 ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ ఆలయం తరువాత పెన్నానది వరదలతో ఇసుకలో కూరుకుపోయింది. కొన్నేళ్ల క్రితం మరల పెన్నానది ఎండిపోయినపుడు ఈ ఆలయం పైభాగం కనిపించింది. అలాగే ఆలయంలోకి వెళ్లే ఒక మార్గం కూడా ఓపెన్ అయ్యింది. కల్కి సినిమాలో బాలుడు తప్పించుకొని పారిపోతూ ఆ గుంతలో పడి నేరుగా అశ్వద్ధామ తపస్సు చేసుకుంటున్న చోటకి జారిపోతాడు.

అక్కడ అశ్వద్ధామని పిల్లాడు చూస్తాడు. కల్కి సినిమాలో ఈ శివాలయాన్ని చూపించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో టెంపుల్ కి సంబందించిన విజువల్స్ వైరల్ గా మారాయి. నెల్లూరు జిల్లావాసులు ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసి కల్కిలో అశ్వద్ధామని చూపించిన ఆలయం ఇదే అని షేర్ చేస్తున్నారు. దీంతో వీడియో కాస్తా వైరల్ అవుతోంది. కల్కి సినిమా కథని 2898ఏడీలో చెప్పిన కూడా ప్రస్తుతం ఉన్న కొన్ని రియలిస్టిక్ లొకేషన్స్ ని కూడా నాగ్ అశ్విన్ తెలివిగా ఉపయోగించాడని మూవీ చూసిన వారికి అర్ధమవుతోంది.

Tags:    

Similar News