గుంటూరు కారం.. సంక్రాంతి పోటీపై ఘాటైన ఆన్సర్

తాజాగా ఇదే విషయంపై ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడారు. గుంటూరుకారం అయితే సంక్రాంతికి రావడం ఖాయం అని తేల్చేశారు.

Update: 2023-10-06 12:30 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. సూపర్ స్టార్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న మూడో సినిమా ఇది కావడం విశేషం. కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే సంక్రాంతి రేసులో చాలా సినిమాలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ హనుమాన్, నా సామి రంగా, కల్కి2898 ఏడీ, రవితేజ ఈగల్ సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. వీటిలో కల్కి వాయిదా పడే అవకాశం ఉంది. గుంటూరు కారం, ఈగల్, హనుమాన్ రిలీజ్ ఖాయంగా కనిపిస్తున్నాయి. నా సామిరంగా మూవీ షూటింగ్ జరుగుతోంది.

ఇప్పుడు దిల్ రాజు విజయ్ దేవరకొండతో పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ సైంధవ్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇప్పటికే నాలుగు లైన్ లో ఉండగా ఇప్పుడు కొత్తగా ఈ రెండు వచ్చి చేరాయి. వీటిలో ఏ సినిమా ఫైనల్ గా ఈ రేసులో ఉంటుందనేది అప్పుడే చెప్పడం కష్టం.

తాజాగా ఇదే విషయంపై ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడారు. గుంటూరుకారం అయితే సంక్రాంతికి రావడం ఖాయం అని తేల్చేశారు. ఒక వేళ ఇంకే సినిమా ఆ టైంలో రిలీజ్ అయితే థియేటర్స్ సమస్య వస్తుంది తప్ప తమ సినిమాకి పోటీ కాదని అన్నారు. ఏ సినిమా అయిన వాయిదా పడుతుందేమో అనే ఉద్దేశ్యంతో అందరూ ముందుగానే స్లాట్ వేసి ఉంచుకుంటున్నారని నేను అనుకుంటున్న అంటూ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

మరి ఆయన చెప్పినట్లు నిర్మాతలు అందరూ కూడా ఏదో ఒక మూవీ వాయిదా పడుతుందిలే అనే నమ్మకంతోనే సంక్రాంతికి రిలీజ్ ఎనౌన్స్ చేసారని అర్ధమవుతోంది. మరి వీటిలో సంక్రాంతి రేసులో ఉండేది ఏదో వెనక్కి పోయేది ఏదో అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News