దేవర సెకండ్ సింగిల్.. నాగవంశీ ప్లానేంటో ఈసారి?

అదే సమయంలో ఫియర్ సాంగ్ రిలీజ్ టైమ్ లో కాస్త హడావుడి చేశారు నాగ వంశీ. దీంతో ఫ్యాన్స్.. ఇప్పుడు ఆయన్నే గుర్తు చేసుకుంటూ సరదాగా రిక్వెస్ట్ చేస్తున్నారు.

Update: 2024-07-31 14:30 GMT
దేవర సెకండ్ సింగిల్.. నాగవంశీ ప్లానేంటో ఈసారి?
  • whatsapp icon

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అంతా వెయిట్ చేస్తున్నారు. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తారక్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సెకండ్ రోల్ కు సంబంధించిన ఫోటో లీక్ కూడా అయింది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ తో పాటు గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా మూవీలోని సెకండ్ సాంగ్ కోసం నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై ఇటీవల థాయిలాండ్ లో రొమాంటిక్ మెలోడీ సాంగ్ షూట్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ పాటను మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని తారక్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఫుల్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

అయితే నిన్న దేవర మేకర్స్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. దేవర అంటూ మ్యూజిక్ సింబల్స్ తో ట్వీట్ పెట్టారు. దానిని రీట్వీట్ చేస్తూ కొద్ది రోజులే అంటూ దేవర మేకర్స్ పోస్ట్ పెట్టారు. దీంతో త్వరలోనే ఆ సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రముఖ నిర్మాత నాగవంశీని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దేవర సెకండ్ సింగిల్ పై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా చేయాలని కోరుతున్నారు.

దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ లో నాగవంశీ.. ఫియర్ సాంగ్ ను సూపర్ హిట్ మూవీ జైలర్ లోని హుకుం సాంగ్ తో పోల్చారు. హుకుం సాంగ్ కచ్చితంగా మర్చిపోతారని కూడా పోస్ట్ పెట్టారు. దీంతో పాటపై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే నాగవంశీ చెప్పినట్లు లేకపోయినా.. మెల్లగా ఫియర్ సాంగ్ మంచి రెస్పాన్సే అందుకుంది. ఇప్పుడు ఫ్యాన్స్.. సెకండ్ సింగిల్ ను బ్లాక్ బస్టర్ మూవీ షారుక్ ఖాన్ జవాన్ లోని చలేయా సాంగ్ తో కంపేర్ చేయమని సజ్జెస్ట్ చేస్తున్నారు.

కాగా దేవర నిర్మాణంలో నాగవంశీ భాగం కాకపోయినా.. తారక్ తో మాత్రం ఆయన సన్నిహితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. పలుమార్లు వీరు కలిసినట్లు ఫోటోస్ కూడా వైరల్ అవుతుంటాయి. దానికి తోడు దేవర.. థియేట్రికల్ హక్కులను నాగవంశీ దక్కించుకున్నారని వార్తలు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. వాటిని పరోక్షంగా ఆయన ఖండించినా.. డీల్ ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. అదే సమయంలో ఫియర్ సాంగ్ రిలీజ్ టైమ్ లో కాస్త హడావుడి చేశారు నాగ వంశీ. దీంతో ఫ్యాన్స్.. ఇప్పుడు ఆయన్నే గుర్తు చేసుకుంటూ సరదాగా రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా రామజోగయ్య శాస్త్రి కూడా క్రేజీ పోస్ట్ పెట్టారు. 'తంగం అంతరంగం హాయిగా..' అంటూ లిరిక్స్ పోస్ట్ చేశారు. సినిమాలో జాన్వీ రోల్ నేమ్ తంగం కావడంతో.. అవి సెకండ్ సింగిల్ లిరిక్స్ గా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన పోస్ట్ వైరల్ గా మారింది. త్వరలోనే దేవర మేకర్స్.. రెండో పాట రిలీజ్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. మరి అభిమానులు కోరుతున్నట్లు నాగ వంశీ పోస్టు పెడతారో? లేక వేరే విధంగా ఎలా హైప్ క్రియేట్ చేస్తారో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News