కింగ్ ని ఢీ కొట్టేది ఆ డైరెక్టర్!
సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర కోసం తమిళ నటుడు..దర్శకుడు ఎస్. జె. సూర్యని తీసుకుంటున్నట్లు వినిపిస్తుంది.
# కింగ్ నాగార్జున 99వ చిత్రం విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన కింగ్ మాస్ లుక్ మాస్ లో పూనకాలు తెప్పిస్తుంది. నాగార్జున ఆహార్యం...గెటప్ ప్రతీది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మాస్ లోనే కొత్త అటెంప్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో కథలు విన్న తర్వాత విజయ్ బిన్నీకి ఈ ఛాన్స్ ఇచ్చారు. సెంచరీ కొట్టే ముందు 99 తో భారీ బ్లస్టర్ అందుకుని రెట్టించిన ఉత్సాహంతో 100వ సినిమా చేయాలి అన్నది నాగ్ ప్లాన్.
అందుకే డౌట్ ఉన్న కంటెంట్ ని పక్కనబెట్టి అనూహ్యంగా విజయ్ ని తెరపైకి తెచ్చారు. మరి ఈసినిమా ఎలా ఉంటుందన్నది చూడాలి. అయితే కథానుగుణంగా సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర కోసం తమిళ నటుడు..దర్శకుడు ఎస్. జె. సూర్యని తీసుకుంటున్నట్లు వినిపిస్తుంది. ఇందులో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసారుట.
హీరోకి ధీటుగా సాగుతుందిట. దీంతో ఆ పాత్రకి ఏరికోరి మరీ సూర్యని ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఏంతో తెలియాలి. ఎస్. జె సూర్య నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా అతనికి ఇంతవరకూ ఫెయిల్యూర్ లేదు. దర్శకుడి బాధ్యతలు పక్కనబెట్టి నటుడైన తర్వాత మరింత బిజీ అయ్యాడు. చేసిన ఏ పాత్రనా పండాల్సిందే. అందుకే పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్' లోనూ విలన్ అయ్యారు.
అంతకు ముందు 'స్పైడర్' లో సైకో పాత్రలో నటించి మెప్పించాడు. విమర్శకుల ప్రశంసలందు కున్నాడు. ప్రస్తుతం తమిళ్ లో మోస్ట్ వాటెండ్ విలన్ గా మారాడు. అలాగే ధనుష్ స్వీయా దర్శకత్వంలో నటిస్తో 50వ సినిమలో కూడా సూర్య నటిస్తున్నాడు. విలన్ పాత్రకి ధనుష్ ఏరికోరి మరీ సూర్యని తీసుకున్నాడు. ఇలా ఇంత ట్రాక్ చూసిన తర్వాత నాగ్ సినిమాలో విలన్ సూర్య అయితే బాగుంటుందని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.