NKR21: ఎంత వరకు వచ్చిందంటే..

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-24 07:44 GMT

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. బింబిసార, అమిగోస్, డెవిల్ తర్వాత ఆయన.. గత ఏడాది కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న NKR 21లో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ యాక్ట్రెస్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు.

కొన్ని నెలల క్రితం, సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్థంతి సందర్భంగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో కళ్యాణ్ రామ్ చాలా పవర్ ఫుల్ గా కనిపించారు. ఆ తర్వాత విజయ శాంతి బర్త్ డే కానుకగా స్పెషల్ గ్లింప్స్ ను షేర్ చేశారు. అందులో యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయే డైలాగ్స్ తో విజయశాంతి పోలీస్ డ్రెస్ లో అదరగొట్టారు.

మంచి భావోద్వేగాలతో పాటు యాక్షన్, ఇంటెన్స్ ఎలిమెంట్స్‌ తో సినిమా తెరకెక్కుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను రివీల్ చేశారు. వైజాగ్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రధాన తారాగణమంతా షెడ్యూల్ లో పాల్గొనున్నట్లు తెలిపారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి, శ్రీకాంత్, సయీ మంజ్రేకర్ సహా పలువురిపై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు చెప్పారు. 15 రోజులపాటు షెడ్యూల్ సాగనున్నట్లు తెలిపారు.

వైజాగ్ షెడ్యూల్‌ తో NKR 21 మూవీ మేజర్ టాకీ పార్ట్ పూర్తవుతుందని మేకర్స్ చెప్పారు. అదే సమయంలో సెట్స్ నుంచి మేకింగ్ స్టిల్ ను షేర్ చేశారు. అందులో మూవీ టీమ్ అంతా వర్క్ లో బిజీగా ఉన్నట్లు కనిపిస్తుండగా.. కళ్యాణ్ రామ్ దీర్ఘంగా ఆలోచిస్తూ నిలుచున్నారు. ప్రస్తుతం కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్యాణ్ రామ్ లుక్.. పవర్ ఫుల్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. సోహైల్ ఖాన్ మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ బాణీలు కడుతున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. మరి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News