పిక్ టాక్‌ : అందాల బార్బీ రాయ్‌

2011లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నందిని రాయ్ కెరీర్‌ ఆరంభంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది

Update: 2024-07-10 05:49 GMT

2011లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నందిని రాయ్ కెరీర్‌ ఆరంభంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. మెల్ల మెల్లగా టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో సినిమాలను చేస్తూ ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే అదృష్టం ఈ అమ్మడి తలుపు తట్టక పోవడంతో స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కలేదు.

హీరోయిన్స్ కి స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తేనే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగగలరు. కానీ నందిని రాయ్‌ కి ఆ అవకాశాలు రాలేదు. అందుకే ఈ అమ్మడు సినిమాల్లో కంటే సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ మధ్య తెలుగు బిగ్‌ బాస్ లో కూడా ఈ అమ్మడు కన్నుల విందు చేసిన విషయం తెల్సిందే.

తెలుగు బిగ్‌ బాస్ తర్వాత ఈ అమ్మడు వెబ్ సిరీస్‌ లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. నటిగా ఇప్పటికీ కూడా బిజీగా ఉంది.. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం స్టార్‌డమ్‌ రావడం లేదు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ వస్తోంది.

తాజాగా బార్బీ డాల్ వంటి అందంతో నందిని రాయ్ కన్నుల విందు చేసింది. బార్బీ మేకోవర్‌ తో భలే ఉందే అనిపించుకున్న ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. నడుము నాభి అందాలను చూపిస్తూ కన్నుల విందు చేసింది. ముద్దుగుమ్మ అందాల నందిని రాయ్‌ ని ఈ లుక్ లో చూస్తూ ఉంటే బార్బీ రాయ్ అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

నందిని రాయ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా 15 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ముందు ముందు ఈ అమ్మడు పెద్ద హీరోలకు వాంటెడ్‌ హీరోయిన్‌ గా నిలిచేనేమో చూడాలి.

Tags:    

Similar News