టైర్ 2 రికార్డ్స్.. ఈసారి నాని లెక్క ఎంతో?

టాలీవుడ్ టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో నాని టాప్ లిస్టులో ఉంటాడు.

Update: 2024-08-28 04:12 GMT

టాలీవుడ్ టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో నాని టాప్ లిస్టులో ఉంటాడు. అలాగే విజయ్ దేవరకొండకి కూడా సాలిడ్ మార్కెట్ ఉంది. అయితే ఆయన మార్కెట్ కి తగ్గ సక్సెస్ లు చాలా కాలంగా పడటం లేదు. విజయ్ దేవరకొండ సినిమాలకి వస్తోన్న ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టి ఆయన మార్కెట్ ఏంటనేది అంచనా వేయవచ్చు. VD12 మూవీతో గీతాగోవిందం, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ కచ్చితంగా వస్తుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ ఉన్నారు.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే ఓపెనింగ్స్ పరంగా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న హీరోగా నాచురల్ స్టార్ నాని ఉన్నారు. దసరా సినిమాతో నాని మొదటి రోజు ఏకంగా 14.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో నాని అందుకున్నారు. అంతకంటే ముందు ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ విజయ్ దేవరకొండ ఖాతాలో ఉండేది. ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ 9.87 కోట్ల కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకున్నారు. ఈ కలెక్షన్స్ ని దసరా బ్రేక్ చేయడంతో ఖుషి రెండో స్థానంలోకి వచ్చేసింది.

ఇక ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీ మూడో స్థానంలో ఉంది. ఈ చిత్రం 9.57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు చేసింది. నాలుగో స్థానంలో సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ నిలవడం విశేషం. డీజే టిల్లు సక్సెస్ క్రేజ్ టిల్లు స్క్వేర్ మీద ఉండటంతో ఈ మూవీ మొదటి రోజు 9.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సాధించింది. టాప్ 5లో రామ్ పోతినేని మాస్ యాక్షన్ మూవీ స్కంద సినిమా నిలిచింది.

ఈ సినిమాకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 8.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం భారీ అంచనాల మధ్యలో ఆగష్టు 29న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాపై ఉన్న బజ్ నేపథ్యంలో కచ్చితంగా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దసరా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ కి సరిపోదా శనివారం ఎసరు పెడుతుందని భావిస్తున్నారు.

ఒక వేళ అది సాధ్యం కాకపోతే తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలోకి అయిన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒక వేళ అదే జరిగితే టైర్ 2 హీరోలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న జాబితాలో టాప్ 1, 2 స్థానాలలో నానినే ఉంటాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి నాని సరిపోదా శనివారం మూవీ టార్గెట్ ని బ్రేక్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏపీ తెలంగాణలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టైర్ 2 హీరోల సినిమాలు

దసరా - 14.22CR

ఖుషి - 9.87CR

లైగర్ - 9.57CR

టిల్లు స్క్వేర్ - 9.25CR

స్కంద - 8.62CR

Tags:    

Similar News