6 నెలలు డేట్స్.. అల్లకల్లోలం సృష్టించేందుకు రెడీ..!

ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెలతో నాని దసరా సినిమా చేశాడు. కొత్త దర్శకుడే అయినా నాని పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాడు శ్రీకాంత్ ఓదెల.

Update: 2024-07-03 07:30 GMT

స్టార్ హీరోలేమో పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటుంటే టైర్ 2 హీరోలు కూడా వారికి ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా నాని లాంటి మినిమం గ్యారెంటీ హీరోలు వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని అలరించేందుకు కృషి చేస్తున్నారు. సినిమా వెంట సినిమాతో సత్తా చాటుతున్నారు. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సుజిత్ తో ఒకటి.. శ్రీకాంత్ ఓదెలతో మరోటి లైన్ లో పెట్టాడు.

ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెలతో నాని దసరా సినిమా చేశాడు. కొత్త దర్శకుడే అయినా నాని పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాడు శ్రీకాంత్ ఓదెల. దసరాతో నాని కూడా ఊర మాస్ సినిమాలు తీయగలడు అని ప్రూవ్ చేశాడు. ఐతే దసరా తర్వాత మళ్లీ నానితోనే శ్రీకాంత్ సినిమాకు రెడీ అయ్యాడు. మరో హీరోకి చేయకూడదని అనుకున్నాడా లేదా తన కథలన్నీ నానికే అనుకున్నాడో ఏమో కానీ దసరా తర్వాత ఏడాది గ్యాప్ ఇచ్చి నానితో మరో సినిమా ప్రకటించాడు శ్రీకాంత్ ఓదెల.

Read more!

దసరా సినిమా పీరియాడికల్ కథగా చెప్పగా ఈసారి కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ లోనే కానీ పొలిటికల్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. కథకు నాని కన్విన్స్ అయ్యాడు అంటే అందులో విషయం ఉన్నట్టే లెక్క. నాని శ్రీకాంత్ ఓదెల ఈసారి దసరాని మించిన సినిమా చేయాలని చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం నాని 6 నెలల బల్క్ డేట్స్ అడిగాడట శ్రీకాంత్ ఓదెల. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ లుక్ అంతా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. నాని కూడా ఈ సినిమా కోసం ముందు వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నాడట.

సో దసరా కాంబో అంటే ఆడియన్స్ లో ఉన్న అంచనాలకు అంతకు మించి అనిపించేలా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని రిపీట్ చేస్తారా లేదా మరో హీరోయిన్ కి వెళ్తారా అన్నది చూడాలి. సరిపోదా శనివారం రిలీజ్ కాగానే సుజిత్ డైరెక్షన్ లో సినిమా మొదలైనా కాకపోయినా సరే శ్రీకాంత్ ఓదెల సినిమా మాత్రం మొదలు పెట్టాలని చూస్తున్నాడు నాని. మరి నాని ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను కొల్లగొడతాడన్నది చూడాలి. నాని ప్లానింగ్ చూసి ఫ్యాన్స్ మాత్రం ఖుషిగా ఉన్నారు.

Tags:    

Similar News

eac