'యానిమల్‌' ని మించి వచ్చినా చేస్తా : నాని

నాచురల్‌ స్టార్‌ హీరోగా నటించిన హాయ్ నాన్న నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌ వస్తోంది.

Update: 2023-12-07 11:07 GMT

నాచురల్‌ స్టార్‌ హీరోగా నటించిన హాయ్ నాన్న నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌ వస్తోంది. నాన్న సెంటిమెంట్‌ తో నాని మరోసారి మంచి మార్కులు కొట్టాడు అంటూ రివ్యూలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన హాయ్ నాన్న సినిమా ప్రమోషన్‌ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు కొన్ని వైరల్‌ అవుతున్నాయి.

దాదాపు రెండు నెలలుగా ఏ టాపిక్ ను వదిలి పెట్టకుండా బర్నింగ్‌ టాపిక్స్ అన్నింటిని కూడా తన సినిమా ప్రమోషన్ కి ఉపయోగించుకుంటూ నాని జనాల దృష్టిని ఆకర్షించాడు. యానిమల్‌, సైంధవ్‌, హనుమాన్ చిత్రాలకు చెందిన వారితో చిట్‌ చాట్ చేస్తూ ఆ సినిమాలతో పాటు తన హాయ్ నాన్న సినిమాకి కూడా కావాల్సినంత ప్రమోషన్‌ చేసుకున్నాడు.

తాజాగా యానిమల్‌ సినిమా పై పాజిటివ్‌ వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. యానిమల్‌ సినిమా టాపిక్ వచ్చిన నేపథ్యంలో నాని ని ఒక జర్నలిస్ట్‌.. యానిమల్ తరహా స్క్రిప్ట్‌ లు వస్తే చేస్తారా.. అలాంటి మ్యాడ్నెస్ పాత్రలు చేసే ఉద్దేశ్యం మీకు ఉందా అంటూ ప్రశ్నించారు.

నాని ఆ ప్రశ్నకు స్పందిస్తూ.. నేను దసరా చేస్తున్న సమయంలో అలాంటి మాస్ పాత్ర లో నన్ను ఊహించుకోలేక పోయారు. కానీ చేసిన తర్వాత చాలా మంది అభినందించారు, అభిమానించారు. అలాగే ఏదైనా పాత్రను చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకం ఉంది.

యానిమల్‌ లో హీరో పాత్రను మించిన మ్యాడ్నెస్ ఉన్న పాత్రలు వచ్చినా కథ నచ్చితే చేసేందుకు సిద్ధం అన్నట్లుగా నాని చెప్పుకొచ్చాడు. మరి నానితో మరీ అంతటి మ్యాడ్నెస్ పాత్రలను చేసేందుకు దర్శక రచయితలు ముందుకు వస్తారా అనేది అనుమానమే.

Tags:    

Similar News