నాని - బలగం వేణు.. ఇది అసలు మ్యాటర్!

ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు అల్ మోస్ట్ సెట్స్ పైకి వస్తాయని అనుకున్న తరుణంలో ఊహించని విధంగా క్యాన్సిల్ అవుతున్నాయి

Update: 2024-06-19 09:32 GMT

ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు అల్ మోస్ట్ సెట్స్ పైకి వస్తాయని అనుకున్న తరుణంలో ఊహించని విధంగా క్యాన్సిల్ అవుతున్నాయి. దర్శకులు ఎంత ఒప్పించినా కూడా హీరోలు అంత ఈజీగా కాంప్రమైజ్ కావడం లేదు. కథ పూర్తి స్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధమైతేనే ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. ఇక 'బలగం' చిత్రం ఫేమ్ వేణు, నేచురల్ స్టార్ నాని కి 'యెల్లమ్మ' అనే కథను వినిపించినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రం త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పినప్పటికీ, నాని 'హాయ్ నాన్న' ప్రమోషన్లలో అలాంటి కథ వినలేదని స్పష్టం చేశారు. ఒకవేళ వేణు మంచి కథతో వస్తే కూడా వర్క్ చేయడానికి సిద్ధమే అని అన్నాడు. ఇక ఆ తర్వాత ఆ కథపై దిల్ రాజు చర్చలు జరిపాడు. నాని వరకు పూర్తి స్థాయిలో వెళ్లలేదట. జస్ట్ అసలు కథపై చర్చలు మాత్రమే జరిగాయట. ఇక నాని నుంచి ఎలాంటి సిగ్నల్ రాకముందే ఆ చిత్రంలో నటించనున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం, నాని ఈ చిత్రంలో నటించడం లేదని తెలుస్తోంది. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, నాని 'బలగం' చిత్రాన్ని ఎంతో ఇష్టపడినా కథ పై చర్చలు ముందుకు సాగలేదు. అలాగే 'దసరా' మరియు 'హాయ్ నాన్న' వంటి విజయవంతమైన చిత్రాల తరువాత, నాని ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా గ్రాండీయర్ సినిమాలను చేయాలని కోరుకుంటున్నారు. ఇక వేణు చెప్పిన కథ విలేజ్ మాస్ ఎమోషనల్ పాయింట్స్ తో ఉందట.

ఇక నాని ఆలోచన విధానంపై ఒక క్లారిటికి వచ్చిన దర్శకుడు ఎక్కువగా టైమ్ వేస్ట్ చేయకుండా మరో ట్రాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వేణు ప్రస్తుతం తన కథలను ఇతర హీరోలకు వినిపిస్తున్నారు, మరియు దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్నారు. అలాగే, 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తో మరో సినిమా కూడా లైన్లో ఉంది.

సుజిత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా కూడా చేయాల్సి ఉన్నప్పటికీ, దానికి నిర్మాత ఫైనలైజ్ కాకపోవడంతో DVV దానయ్య ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక నాని సుజిత్ తో ఛాన్స్ మిస్ చేసుకోవద్దని మరో నిర్మాతను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లిస్టులో మరో ఇద్దరు దర్శకుల కథలు కూడా ఉన్నాయట. కథలు పూర్తి స్థాయిలో సిద్ధమైతే నాని వాటిపై కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News